Vijay Deverakonda: పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లి.. దేవరకొండ స్వీట్ సర్ప్రైజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Deverakonda and his family attended the wedding of his personal guard Ravi: రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకి యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అసలు పెద్దగా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చిన విజయ్ చాలా కాలం ఎన్నో కష్టాలు పడి ఈరోజు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు అందరూ గుర్తించుకునే స్థాయికి వచ్చాడు. సాధారణ కుటుంబం నుంచి రావడంతో విజయ్ కి ముందు నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే విజయ్ చేసే పనులు మాత్రం ఊహాతీతం. కరోనా సమయంలో మిడిల్ క్లాస్ ఫండ్ ఇవ్వడం మొదలు ప్రతి ఏటా పుట్టినరోజుకు ప్రత్యేకమైన గిఫ్టులు పంచుతూ ఉంటాడు. అలాంటి విజయ్ తన పర్సనల్ బాడీ గార్డుకు ఊహించని షాక్ ఇచ్చాడు. అసలు విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండ దగ్గర రవి అనే కుర్రాడు పర్సనల్ బాడీ గార్డుగా పని చేస్తున్నాడు.
Nayattu Telugu: తెలుగులో రీమేక్ అయ్యాక డబ్బింగయి వస్తున్న మలయాళ బ్లాక్ బస్టర్
Also Read
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
తాజాగా రవి వివాహం చేసుకుంటూ తన యజమాని విజయ్ సహా ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని ఆహ్వానించాడు. ఒక ఇంట్లో పని చేస్తున్న సమయంలో ఏదైనా శుభకార్యం అంటే మాములుగా ఆహ్వానిస్తారు. అలానే విజయ్ ఫ్యామిలీని కూడా ఆహ్వానించాడు రవి. కానీ ఈ విషయాన్ని లైట్ తీసుకోకుండా విజయ్ దేవరకొండ తన కుటుంబం మొత్తాన్ని తీసుకుని వెళ్లి రవి ఫ్యామిలీ మొత్తానికి ఒక స్వీట్ షాక్ ఇచ్చ్చాడు. ఇక అక్కడి ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఫ్యామిలీ ఇస్తారనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఆశించిన మేర ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా మీద దేవరకొండ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
The @TheDeverakonda and his family attended the wedding of his personal guard, #Ravi and blessed the beautiful couple 💑 pic.twitter.com/CxyWZeMNAd
— GSK Media (@GskMedia_PR) April 23, 2024
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!