వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి కాయలు ఎక్కడ చూసిన కనిపిస్తాయి.. ఎండలు ఎంతగా పెరుగుతున్నా కూడా మామిడి కాయలను తినకుండా ఉండరు.. వాటి వాసనకే కడుపు నిండిపోతుంది.. అందుకే జనాలు మామిడిని ఎక్కువగా తింటారు.. అయితే మామిడిని కొనగానే అలానే తినకుడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మామిడి కాయలను తినడానికి ముందు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు.. అస్సలు ఆలస్యం చెయ్యకుండా అవేంటో ఒకసారి చూసేద్దాం..
ఈ మామిడి పండ్లలో విటమిన్ ఎ, సి వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక పనితీరు, దృష్టి ఆరోగ్యంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. ఫైబర్ అధికంగా ఉండే ఈ పండ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మామిడి పండ్లలో బీటా కెరోటిన్ మరియు ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.. మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుందని చెబుతున్నారు.
అయితే చాలా మందికి ఒక సందేహం వస్తుంది.. మామిడి కాయలను కొన్న వెంటనే నేరుగా కడిగి తీసుకుంటారు.. అలా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయాని నిపుణులు చెబుతున్నారు. తొక్క పై కెమికల్స్, పురుగు మందులు ఎక్కువగా ఉంటాయి.. అందుకే వాటిని కాసేపు నానబెట్టి తీసుకోవడం వల్ల చర్మంపై ఉన్న మురికి లేదా పురుగుమందుల అవశేషాలు తొలగిపోతాయి. మామిడి పండ్లను అమ్మేవారు బాగా కడగకపోతే లేదా నిల్వ చేసే సమయంలో కలుషితాలకు గురై అనారోగ్యాన్ని కలిగిస్తాయి.. వాటి నుంచి బయట పడాలంటే నీటిలో నానబెట్టి శుభ్రం చేశాక తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.