Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- తక్కువ ధరకే ఫ్లాట్లు అంటూ.. రూ.500 కోట్ల టోకరా
- ప్రీలాంచ్ ఆఫర్.. వందల మందికి బిగ్ షాక్
- ఫ్లాట్లు లేవు.. డబ్బులు లేవు.. రూ.500 కోట్ల మోసం
- తెల్లాపూర్ ప్రీలాంచ్ స్కామ్.. సీసీఎస్‌లో ఫిర్యాదు
- సొంతింటి ఆశ చూపి రూ.500 కోట్లు వసూలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ సమీపంలోని తెల్లాపూర్‌లో ‘ప్రీలాంచ్ ఆఫర్’ పేరుతో వందలాది మంది కొనుగోలుదారులను నిలువునా ముంచిన ఒక భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ ధరకే విలాసవంతమైన ఫ్లాట్లు ఇస్తామని నమ్మబలికి వందల మంది నుంచి రూ.500 కోట్ల వరకు వసూలు చేసి, ఆపై నిర్మాణాలు చేపట్టకుండా పరారయ్యారని ‘త్రిపురా కన్స్ట్రక్షన్’ సంస్థపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మోసపూరిత వ్యవహారంలో త్రిపురా కన్స్ట్రక్షన్ చైర్మన్ పసుపులేటి సుధాకర్‌తో పాటు సంస్థ ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఐటీ, బీడీఎల్ ఉద్యోగులే టార్గెట్.. రూ.500 కోట్లు వసూలు
2021వ సంవత్సరంలో తెల్లాపూర్ ప్రాంతంలో త్రిపురా కన్స్ట్రక్షన్స్ సంస్థ ప్రీలాంచ్ ఆఫర్‌ను ప్రకటించింది. మార్కెట్ ధర కంటే తక్కువకే సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బీడీఎల్ (BDL) ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తమ జీవితకాల సంపాదనను, దాచుకున్న పొదుపు సొమ్మును భారీగా ఈ ప్రాజెక్టులో పెట్టుబడిగా పెట్టారు. వందలాది మంది కొనుగోలుదారుల నుంచి దాదాపు రూ.500 కోట్ల వరకు వసూలు చేసిన నిర్వాహకులు, ఏళ్లు గడుస్తున్నా సదరు స్థలంలో కనీసం పునాది పనులు కూడా ప్రారంభించలేదని బాధితులు వాపోతున్నారు.
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
భూముల విక్రయానికి కుట్ర.. బాధితుల ఆవేదన
బాధితులు ఫ్లాట్ల నిర్మాణం గురించి లేదా చెల్లించిన డబ్బుల పురోగతి గురించి ప్రశ్నించినప్పుడు సంస్థ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం రాలేదు. అంతేకాకుండా ఫ్లాట్ల నిర్మాణం కోసం కొనుగోలుదారుల సొమ్ముతో సేకరించిన స్థలాన్ని, ఇప్పుడు బాధితులకు తెలియకుండా మరొక నిర్మాణ సంస్థకు విక్రయించేందుకు పసుపులేటి సుధాకర్ కుట్ర పన్నుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సొంతింటి కల నెరవేరకపోగా, చెల్లించిన అసలు సొమ్ము కూడా తిరిగి రాకపోవడంతో తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక, మానసిక క్షోభకు గురవుతున్నాయని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సమగ్ర దర్యాప్తుకు బాధితుల డిమాండ్
త్రిపురా కన్స్ట్రక్షన్ ప్రతినిధులపై తక్షణమే కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరపాలని, ఈ కుంభకోణానికి బాధ్యులైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సీసీఎస్ పోలీసులను బాధితులు డిమాండ్ చేశారు. కష్టపడి సంపాదించుకున్న తమ సొమ్మును సురక్షితంగా రికవరీ చేసి, తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. కేసు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితులపై చర్యలకు సమాయత్తమవుతున్నారు.
తాజావార్తలు
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!