Telangana Weather: తెలంగాణకు కూల్ న్యూస్.. భారీ వానలపై క్లారిటీ ఇచ్చిన వాతావరణ కేంద్రం
- మూడు రోజులు తేలికపాటి వర్షాలు
- భారీ వర్ష హెచ్చరికలు లేవు
- కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం
- హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఇదే పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్ 5, 2026 నాటి మీడియా వాతావరణ బులెటిన్‌లో వివరాలను వెల్లడించింది. వాయువ్య మధ్యప్రదేశ్ , దానికి ఆనుకుని ఉన్న నైరుతి ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో కొనసాగుతున్న సుస్పష్టమైన అల్పపీడన ప్రాంతం, ఈ రోజు ఉదయం 08:30 గంటలకు సాధారణ అల్పపీడనంగా బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.
Also Read
- KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
- CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
- Vivek Venkataswamy: చెన్నూరుకు మహర్దశ.. రూపురేఖలు మారుస్తా.. మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతా
- Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
ఇది రాబోయే 24 గంటల్లో దాదాపు అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి శ్రీ గంగానగర్, నార్నౌల్, వాయువ్య మధ్యప్రదేశ్ అల్పపీడన కేంద్రం, సిధి, డాల్టన్‌గంజ్, బంకురా మీదుగా త్రిపుర వైపు సాగుతోంది.
మరోవైపు, దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ , తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో మరొక ద్రోణి కొనసాగుతోంది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో ఈ రోజు, రేపు , ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి భారీ వర్ష హెచ్చరికలు జారీ చేయలేదని వాతావరణ కేంద్ర సంచాలకులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Telangana Weather: తెలంగాణకు కూల్ న్యూస్.. భారీ వానలపై క్లారిటీ ఇచ్చిన వాతావరణ కేంద్రం
-
Chadalavada :కొండపైన వెంకన్న సన్నిధిలా.. టీ నగర్లో అన్నగారి ఇల్లు
-
New ZPs: ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
-
Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
-
Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!