Site icon NTV Telugu

Jubilee Hills By Poll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ.. క్లారిటీ ఇచ్చిన సీఎం చంద్రబాబు

Cm Chandrababu

Cm Chandrababu

Jubilee Hills By Poll : తెలంగాణ టీడీపీ నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉండవల్లిలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణలోని పలు జిల్లాల నేతలు హాజరయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబుతో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుని నియామకం, పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది.

నేతల సమాచారం ప్రకారం, తెలంగాణలో ఇప్పటికే 1.78 లక్షల మంది పార్టీ సభ్యత్వం పొందారని చంద్రబాబుకు వివరించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీల నియామకాలు త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా నేతలు సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఆలస్యం అయితే, తాత్కాలికంగా రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా వారు అభిప్రాయపడ్డారు.

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు, “పార్టీని గ్రామ స్థాయి నుంచి మళ్లీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించే వారికి బాధ్యతలు అప్పగిస్తాం” అని తెలిపారు. త్వరలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి నియామకం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల విషయంలో పార్టీ తటస్థంగా ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

అయితే, బీజేపీ అధికారికంగా మద్దతు కోరితే, ఆ నియోజకవర్గంలో వారికి సహకారం అందించడానికి పార్టీ సిద్ధంగా ఉందని నేతలు స్పష్టం చేశారు. ఇక రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ బలం ఉన్న ప్రాంతాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి అరవింద్ కుమార్ గౌడ్ పేరు ముందంజలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Pooja-Hegde : టాలీవుడ్‌కి కమ్‌బ్యాక్ చేస్తున్న పూజా హెగ్డే.. షాకింగ్ రెమ్యునరేషన్

Exit mobile version