Holidays: పాఠశాలలకు సెలవులు పెంపు.. కానీ.. మీరు అనుకునేది కాదండోయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Holidays: జూన్‌లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జూన్ 12, 2024 నుండి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. పాఠశాలలు తెరిచే సమయం ఆసన్నమైనందున, సెలవులను పెంచాలనే కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో మార్పులు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. సెలవులు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తోంది. అయితే ఇది వేసవి సెలవుల గురించి కాదు.. పండుగలకు ప్రకటించిన సెలవుల గురించి.
Read also: Hyderabad Power Cut: నేడు నగరంలో పవర్ కట్.. ప్రాంతాల వారీగా షెడ్యూల్..
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్లో పండుగలకు ఇచ్చే సెలవుల్లో సైన్స్ లేదని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం అభిప్రాయపడింది. తొలి ఏకాదశి పండుగకు సెలవు ఇవ్వాలని సూచించింది. దీపావళి పండుగకు కూడా రెండు రోజులు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అదేవిధంగా మహాశివరాత్రి మరుసటి రోజు కూడా సెలవు ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని అకడమిక్ క్యాలెండర్లో మార్పులు చేయాలని కోరారు. వారి అభ్యర్థనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే పాఠశాలలకు సెలవులు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్లో 1-10వ తరగతికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. దీని ప్రకారం, తెలంగాణలో పాఠశాలలు జూన్ 12, 2024న పునఃప్రారంభించబడతాయి.
Read also: IndiGo flight: ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపులు..
అలాగే ఏప్రిల్ 24, 2025న ముగుస్తుంది. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు 229 రోజులు పనిచేస్తాయి. అదేవిధంగా వచ్చే ఏడాది వేసవి సెలవులను కూడా ఈ అకడమిక్ క్యాలెండర్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 24, 2025 నుండి జూన్ 11, 2025 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. దసరా సెలవులు 2024 అక్టోబర్ 2-14 నుండి దాదాపు 13 రోజుల పాటు కొనసాగుతాయి. 2025 సంక్రాంతి సెలవులు జనవరి 13-17 నుండి మొత్తం 5 రోజులు ఉంటాయి. అలాగే 2024లో 27 సాధారణ సెలవులు మరియు 25 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. జనవరి 15న సంక్రాంతి సెలవులు, మార్చి 8న మహాశివరాత్రి, మార్చి 25న హోలీ, ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 17న శ్రీరామనవమి, జూన్ 17న బక్రీద్, సెప్టెంబర్ 7న వినాయక చవితి, అక్టోబర్ 10న దసరా, అక్టోబర్ 31న దీపావళి హాలీడేస్ ఇస్తున్నారు.
Rashmika Mandanna: రష్మిక ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. మీరు అనుకున్నదే!
తాజావార్తలు
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!