NTV Telugu Site icon

Telangana Govt: రుణమాఫీకి మరో వెయ్యి కోట్లు.. రూ.1.20 లక్షల రుణాలున్న రైతుల ఖాతాల్లో జమ

Formers

Formers

Telangana Govt: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కోసం మరో వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేసిన విషయం తెలిసిందే.. రూ.1.20 లక్షల రుణాలు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.99,999 జమ చేశారు. రుణమాఫీ పథకం కింద మొత్తం 29.61 లక్షల మంది రైతుల్లో 21.35 లక్షల మంది రైతులకు రూ.11,812 కోట్ల రుణాలను మాఫీ చేశారు. ఇంకా 8.26 లక్షల మంది ఉన్నారని.. వారి రుణాలు మాఫీ చేసేందుకు మరో రూ. 8 వేల కోట్లు విడుదల చేయాలి. రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 19 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో రుణమాఫీ ప్రక్రియ వేగవంతం అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగస్టు 3 నుంచి రెండో విడత రుణమాఫీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.మొత్తం 29.61 లక్షల మంది రైతులకు రూ. 19 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. ఆగస్టు 15న ఒక్కరోజే రూ.5,809 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో 9 లక్షల మంది రైతులకు రుణ విముక్తి లభించింది.

Read also: Rajnath Singh : మహిళా శాస్త్రవేత్తలకు కృతజ్ఞతతో కూడిన బహుమతి

ఇప్పటి వరకు 1.20 లక్షల రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించి రూ.99,999 రుణమాఫీ చేశారు. రానున్న రోజుల్లో రూ. లక్షల్లో రుణాలు తీసుకున్న రైతుల రుణాలు కూడా మాఫీ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలుత రూ. 35,31,913 మంది రైతులకు నాలుగు విడతల్లో రూ.16,144.10 కోట్ల రుణాలు మాఫీ కాగా లక్షల వరకు వ్యవసాయ రుణాలు రద్దు చేశారు. రెండో విడతలో భాగంగా.. 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు రూ. లక్ష లోపు రుణాలు తీసుకున్న 42.56 లక్షల మంది రైతుల రూ.28,930 కోట్ల రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో రూ.25 వేల లోపు రుణాలను రద్దు చేశారు. రెండో దశలో రూ.50 వేల లోపు రుణాలను రద్దు చేశారు. తాజాగా రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు రుణమాఫీకి 19 వేల కోట్లు విడుదల చేస్తామన్నారు. ఆగస్టు 3 నుంచి రుణమాఫీ మళ్లీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రైతు బంధు పద్ధతిలో సెప్టెంబరు వరకు నెల పదిహేను రోజుల్లో పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Bedurulanka 2012 : సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసిన బెదురులంక మూవీ..

Show comments