Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
- ఆగస్టు 10 వరకు SIR ప్రక్రియకు అవకాశం
- రాష్ట్రంలో 77% ఫారాల డిజిటలైజేషన్ పూర్తి
- యాదాద్రి టాప్.. హైదరాబాద్‌లో నెమ్మదిగా ప్రక్రియ
- 100 శాతం పూర్తి చేయాలని సీఈఓ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana SIR : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ముమ్మర ఓటర్ల పరిశీలన , సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించిన గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) బి. సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, మిగిలిన పనిని ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయడానికి వీలుగా గడువును ఆగస్టు 10 వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు. ఓటర్ల సమాచారాన్ని పక్కాగా నవీకరించడం , అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
77% డిజిటలైజేషన్ పూర్తి.. జిల్లాల వారీగా గణాంకాలు
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 77.12 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని సీఈఓ తెలిపారు. మొత్తం 3,38,26,448 ఓటర్లకు గాను 2,60,88,334 ఫారాల డిజిటలైజేషన్ నమోదైంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే యాదాద్రి భువనగిరి జిల్లా 94.25 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, జనగామ (91.44%), మెదక్ (90.52%), సూర్యాపేట (90.35%) , మహబూబాబాద్ (90.08%) జిల్లాలు 90 శాతానికి పైగా డిజిటలైజేషన్‌తో అత్యుత్తమ పనితీరును కనబరిచాయి.
Also Read
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
మరోవైపు హైదరాబాద్ పరిధిలోని ప్రధాన నగర ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కాస్త నెమ్మదిగా సాగుతోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61.37 శాతం, రంగా రెడ్డి జిల్లాలో 63.43 శాతం , హైదరాబాద్ జిల్లాలో 56.31 శాతం డిజిటలైజేషన్ నమోదు కాగా, సంగారెడ్డిలో 78.01 శాతం నమోదైంది. ఈ పట్టణ ప్రాంతాలలో కూడా సత్వరమే ప్రక్రియను వేగవంతం చేసేందుకే ఆగస్టు 10 వరకు సమయం ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన గడువులోగా ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని సిఈఓ ఆదేశించారు.
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?