Rythu Bharosa : రైతులకు గుడ్‌న్యూస్.. 5-6 ఎకరాలకు రైతు భరోసా జమ
- 67.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు
- 6 ఎకరాల లోపు రైతులకు పెట్టుబడి సాయం పూర్తి
- రికార్డు వేగంతో నిధుల జమ
- ప్రభుత్వం హామీని నిలబెట్టుకుందన్న మంత్రి తుమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bharosa : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం సీజన్‌కు గాను ‘రైతు భరోసా’ నిధుల విడుదలలో సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 5 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 67.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 7,135.77 కోట్ల నిధులను నేరుగా జమ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ప్రతి అర్హులైన రైతుకు పెట్టుబడి సాయాన్ని అందజేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఆరో రోజున 6 ఎకరాల లోపు రైతులకు నిధులు
అధికారిక నివేదికల ప్రకారం, నిధుల విడుదలలో భాగంగా 5వ రోజున (04-07-2026) 5 నుంచి 6 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 1.68 లక్షల మందికి పైగా లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో రూ. 545.40 కోట్లను ప్రభుత్వం విజయవంతంగా జమ చేసింది. జూన్ 30న ప్రారంభమైన ఈ పెట్టుబడి సాయం పంపిణీ ప్రక్రియ.. ప్రతిరోజూ భూమి విస్తీర్ణం వారీగా క్రమబద్ధంగా సాగుతూ కేవలం ఐదు రోజుల్లోనే 6 ఎకరాల పరిధి వరకు ఉన్న రైతులందరికీ చేరింది.
Also Read
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
రికార్డు స్థాయిలో సాగిన పెట్టుబడి సాయం పంపిణీ
మొదటి రోజున ఒక ఎకరం , రెండు ఎకరాల లోపు ఉన్న దాదాపు 44.27 లక్షల మంది రైతులకు రూ. 2,482 కోట్లకు పైగా నిధులను విడుదల చేయడంతో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాతి రోజుల్లో వరుసగా 3 ఎకరాలు, 4 ఎకరాలు, , 5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన లక్షలాది మంది రైతుల ఖాతాల్లో విడతల వారీగా వందలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసుకుంటూ వచ్చింది. ఈ విధంగా మొత్తం 1.18 కోట్లకు పైగా ఎకరాల సాగుభూమికి సంబంధించి రికార్డు స్థాయిలో నిధులను వేగంగా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి చేర్చడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?