Telangana Rains : తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. మరో వారం భారీ వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఇటీవల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే..నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గత పది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ వర్షాలకు జనం బిక్కు బిక్కు మంటున్నారు.ద్రోణి ప్రభావంతో రానున్న వారం రోజులపాటు రాష్ట్రంలోని పలు చోట్ల మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది..
గడిచిన 24 గంటల్లో మెదక్ జిల్లా రామాయంపేట, జనగామ జిల్లా జఫర్ గఢ్, వరంగల్ జిల్లా సంగెంలో 4సెంటిమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రానున్న 24 గంటల్లో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.. నైరుతి దిశగా ఉపరితల గాలులు గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించింది. గురువారం మహబూబాద్ జిల్లా గార్ల, మెదక్ జిల్లా రేగోడ్ లో 4 సెంటీమీటర్ల, భద్రాచలం, కొత్తగూడెంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది..
Also Read
ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలుస్తుంది.. కొన్ని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.. ఇకపోతే వర్షాల నుంచి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు..అలెర్ట్ ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. దోమలు, సీజనల్ వ్యాదులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. వేడి వేడిగా తినడం, వేడి నీళ్లను తాగుతూ ఉండాలని అధికారులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!