Telangana : తెలంగాణలో మళ్లీ వర్షాలు.. మరో రెండు రోజులు వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఉన్నట్లుండి వాతావరణం చల్లగా మారింది.. గత రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగ్గా తాజాగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గురువారం తెల్లవారుజామున పలు చోట్ల భారీ వర్షం కురిసింది.. దీంతో తెలంగాణ మొత్తం వాతావరణం చల్లగా మారింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం సమీపంలోని పశ్చిమబంగ, ఒడిశా తీరాల్లో కొనసాగుతుంది..
ఈ మేరకు ఆదిలాబాద్, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి, భద్రాత్రి కొత్తగూడెం, సిద్ధిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాలకు వాతావారణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక తెలంగాణ వచ్చే రెండు రోజులు కూడా ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు..
Also Read
ఇక రానున్న 4 రోజులు పొగమంచుతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది.. గురువారం నుంచి మరో వారం రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే అక్టోబర్ నెలలో 6వ తేదీ నంఉచి 12వ తేదీ వరకు నైరుతి రుతుపవనాలు వీడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.. తెలంగాణాలో మాత్రమే కాదు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..
తాజావార్తలు
-
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..