NTV Telugu Site icon

Praja Palana: నడిరోడ్డుపై ప్రజా పాలన దరఖాస్తులు.. బైక్‌పై తరలిస్తోన్న క్రమంలో..

Prajapalana

Prajapalana

Praja Palana: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుపై కసరత్ ప్రారంభిస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం గత నెల 28న అధికారికంగా ప్రారంభమై ఈ నెల 6న ముగిసింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం ప్రభుత్వ పథకాల కోసం ఉద్దేశించినవే. ఇళ్లు, చేనేత మగ్గాలు, తెల్ల రేషన్‌కార్డులు మంజూరు చేయాలని ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఇళ్ల దరఖాస్తులు రెండో స్థానంలో నిలిచాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు అత్యధికంగా దరఖాస్తులు చేసుకున్నారు. వాటన్నింటినీ కంప్యూటరీకరించే బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది. వాటన్నింటినీ ఈ నెల 17వ తేదీలోగా కంప్యూటరీకరించాలని గడువు విధించారు.

Read also: Bengaluru: నాలుగేళ్ల కొడుకును హత్య చేసి బ్యాగులో తీసుకెళ్లిన ఓ కంపెనీ సీఈఓ

నిరుపేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్న దరఖాస్తులను తరలించేందుకు ప్రభుత్వం ర్యాపిడో బైక్‌ల సేవలను వినియోగించుకుంటోందని సమాచారం. హయత్ నగర్ సర్కిల్ పరిధిలో దాఖలైన దరఖాస్తులను ర్యాపిడో బైక్ ద్వారా కంప్యూటరీకరించే క్రమంలో ర్యాపిడో బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో ప్రజాపాలన దరఖాస్తులు అన్నీ ఒక్క సారిగా కిందికి పడ్డాయి. దీంతో ప్రజాపాలన దరఖాస్తులు బాలానగర్ ఫ్లైఓవర్ పై చెల్లాచెదురుగా కిందపడ్డాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు వాటిని పట్టుకునుందుకు ప్రయత్నిస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలంగాణలో ఆరు హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అందజేసిన ప్రజా పరిపాలన దరఖాస్తులు రోడ్డున పడ్డటంతో ఒక్కటి మిస్సైనా.. అర్హులకు అన్యాయం జరిగినట్టే అని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఇదంతా కావాలని చేయలేదని ర్యాపిడో బైక్ లో జాగ్రత్తగా తరలిస్తుండగా బైక్ స్కిడ్ కావడంతోనే రోడ్డుపై చల్లాచెదురుగా కింద పడ్డాయని అంటున్నారు. ప్రజా పాలన దరఖాస్తులు కింద పడటం చూసిన కొందరు వ్యక్తులు కావాలని దీన్ని వైరల్ చేస్తున్నారని ర్యాపిడో బైక్ యాజమాన్యం మండిపడుతున్నారు.
King Nag: మహేష్, తేజా సజ్జా, వెంకీ మామా అయిపోయారు… ఇక ఇప్పుడు కింగ్ నాగ్ టైమ్