Transfers : తెలంగాణ ప్రభుత్వ హోం శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో విస్తృత స్థాయిలో బదిలీలు చేపట్టింది. డీజీపీ ఆదేశాల మేరకు మొత్తం ఎనిమిది మంది నాన్ కేడర్ ఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంలో డీసీపీగా పనిచేస్తూ పలు కీలక కేసులను దర్యాప్తు చేసిన దార కవితను ఈ బదిలీల్లో భాగంగా వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా నియమించారు.
Minister Srinivasa Rao: విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్ తర్వాత ప్రపంచమే ఏపీ వైపు చూస్తుంది..
ఐబొమ్మ ఇమంది రవి కేసు విచారణ కొనసాగుతున్న సందర్భంలోనే కవిత బదిలీ కావడం ఆసక్తికరంగా మారింది. ఆమె స్థానంలో రాచకొండ కమిషనరేట్‌కు చెందిన క్రైమ్ డీసీపీ ఎన్. అరవింద్ బాబును సీసీఎస్ డీసీపీగా నియమించింది. ఈ ఉత్తర్వులతో పాటు పెద్దపల్లి డీసీపీ పి. కరణూలకర్‌ను ఇన్టెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా నియమించారు. అలాగే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వై.వి.ఎస్. సుచేంద్రకు సైబరాబాద్ ఎస్బీ డీసీపీగా నియమించారు.
సైబరాబాద్ ఎస్బీ డీసీపీ బి. సాయి శ్రీని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా మారగా, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఎస్.వి.ఎన్. శివరాంను ACB ఎస్పీగా నియమించారు. ట్రాన్స్‌కో ఎస్పీగా పనిచేస్తున్న జగదీశ్వర్ రెడ్డికి ఇన్టెలిజెన్స్ విభాగంలో కొత్త బాధ్యతలు ఇవ్వగా, ఇన్టెలిజెన్స్ ఎస్పీగా ఉన్న ఎం.రవీంద్ర రెడ్డిని గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా మార్చారు. అదనపు కమిషనర్ హైదరాబాద్‌గా పనిచేస్తున్న ఎన్. అశోక్ కుమార్ ఇకపై సీఐడీ ఎస్పీగా పని చేయనున్నారు. ఈ బదిలీల నేపథ్యంలో అధికారులు తమ ప్రస్తుత స్థానాల నుండి వెంటనే రిలీవ్ అవ్వాలని, కొత్త బాధ్యతల కోసం తక్షణమే హాజరుకావాలని ఆదేశించింది ప్రభుత్వం.
Ibomma Ravi: మూడోరోజు కస్టడీలో కీలక పరిణామం.. రవిని స్వయంగా విచారిస్తున్న సీపీ సజ్జనార్!
