Police Band Competition : జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసుల సత్తా.. రజత పతకం కైవసం

  • జాతీయ బిగిల్ పోటీల్లో తెలంగాణకు రజతం
  • హైదరాబాద్‌లో ఐదు రోజులపాటు పోటీలు
  • విజేతలను అభినందించిన డీజీపీ సీవీ ఆనంద్
  • మరిన్ని విజయాలకు ప్రత్యేక శిక్షణపై దృష్టి
Police Band Competition

Police Band Competition

27వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీలు (2026–27)లో రజత పతకం సాధించిన తెలంగాణ పోలీస్ బిగిల్ బృందాన్ని డీజీపీ సీవీ ఆనంద్ అభినందించారు. హైదరాబాద్‌లోని సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లో నవంబరు 16 నుంచి 20 వరకు జరిగిన ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పోలీస్ బలగాలకు చెందిన బ్యాండ్, బిగిల్ బృందాలు పాల్గొన్నాయి. ఈ జాతీయ స్థాయి పోటీల్లో బిగిల్ విభాగంలో తెలంగాణ పోలీస్ బృందం ప్రతిభ చూపి రజత పతకం సొంతం చేసుకోవడం గర్వకారణమని డీజీపీ పేర్కొన్నారు.

భవిష్యత్తులో మరిన్ని విజయాలే లక్ష్యం

ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ సీవీ ఆనంద్, భవిష్యత్తులో తెలంగాణ పోలీస్ బిగిల్, బ్యాండ్ బృందాలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పతకం సాధించిన బృందం సభ్యులు వీరే

రజత పతకం సాధించిన బృందంలో ఎస్. సంతోష్ (హెచ్‌సీ 1967 – ఇంచార్జ్ & కెప్టెన్), కె. స్వామి (హెచ్‌సీ 2562), ఎస్. వెంకటయ్య (హెచ్‌సీ 873), జి. వెంకటస్వామి (హెచ్‌సీ 1427), ఏవీఎస్ భావన రుషి (హెచ్‌సీ 197)తో పాటు కానిస్టేబుళ్లు కె. రామ్ లాల్ (పీసీ 3361), ఎస్. ప్రవీణ్ కుమార్ (పీసీ 10250) సభ్యులుగా ఉన్నారు. వీరంతా రాష్ట్రంలోని వివిధ పోలీస్ బెటాలియన్లు, పోలీస్ శిక్షణ సంస్థలు, హైదరాబాద్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో పని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఐజీ డా. గజరావు భూపాల్, స్పోర్ట్స్ డీఎస్పీ డా. రామారావుతో పాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.