CM Revanth Reddy : అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లు తాకుతున్న తెలంగాణ
- తలసరి ఆదాయంలో భారీ పెరుగుదల
- 10.23% వృద్ధితో తెలంగాణ దూకుడు
- సుపరిపాలనతో రాష్ట్రానికి కొత్త ఊపు
- అభివృద్ధి పథంలో మరిన్ని మైలురాళ్లు: సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 2023లో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం వేగవంతమైన ప్రగతిని సాధిస్తూ, అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లను తాకుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సరైన విధానపరమైన పరిపాలన, పెట్టుబడుల ఆకర్షణ , ఉద్యోగాల కల్పన ద్వారా రాష్ట్రం నేడు దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డు
రాష్ట్ర ఆర్థిక పురోగతికి అద్దం పడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ తలసరి ఆదాయం రూ. 4,18,931కి చేరింది. గత ఏడాదితో పోలిస్తే ప్రజల తలసరి ఆదాయంలో ఏకంగా రూ. 38,900 పెరుగుదల నమోదవ్వడం విశేషం. కేవలం ఒకే ఏడాది వ్యవధిలో 10.23% వృద్ధి రేటును సాధించి తెలంగాణ ఆర్థికంగా బలమైన శక్తిగా ఎదిగిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
పారదర్శక పాలనతో నూతన ఉత్సాహం
గత దశాబ్ద కాలంగా ఉన్న లోపాలను, అస్తవ్యస్తమైన పరిపాలనా విధానాలను సరిదిద్ది, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. సమర్థవంతమైన ప్రణాళికలు, సుపరిపాలన , ఆర్థిక క్రమశిక్షణే ఈ అసాధారణ వృద్ధికి ప్రధాన కారణాలని ఆయన అభిప్రాయపడ్డారు. నాటి లోపాలను సరిదిద్దడం ద్వారా నేడు ప్రజల్లో నూతన ఉత్సాహం, నమ్మకం నింపగలిగామని, ఇదే వేగంతో రాష్ట్రాన్ని మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!