NTV Telugu Site icon

Telangana: సాయుధ పోరాటం కాంగ్రెస్, కమ్యూనిస్టులదే… మిగతావాళ్లు పుట్టనే లేదు..!

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ ఇప్పుడు ప్రధానంగా సెప్టెంబర్‌ 17వ తేదీపై చర్చ సాగుతోంది.. విమోచనం అని ఒకరంటే.. విలీనమని మరొకరు.. ఇలా సెప్టెంబర్‌ 17పై రచ్చ సాగుతోంది.. అయితే.. . సాయుధ పోరాటంలో పాల్గొన్నది కాంగ్రెస్.. కమ్యూనిస్టులే… మిగతా వాళ్లు అప్పటికీ పుట్టనేలేదన్నారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి… బీజేపీ, టీఆర్ఎస్‌ పుట్టకముందే పోరాటం చేసింది కాంగ్రెస్‌ అన్న ఆయన.. నిజాం రాజ్యం ఏలుతుంటే.. సైనిక చర్యతో స్వాతంత్య్రం ఇప్పించింది కాంగ్రెస్ అని.. ఇవి స్వాతంత్ర్య ఉత్సవాలు అన్నారు రేవంత్‌.. ఇక, బీజేపీ అతి తెలివి తేటలు ప్రదర్శిస్తుందని మండిపడ్డ ఆయన.. టీఆర్ఎస్‌, ముస్లిం మైనార్టీలను కాపాడుతున్నట్టు కేసీఆర్‌ షో చేస్తున్నారని ఆరోపించారు.

Read Also: New Smartphones: భారత్‌ మార్కెట్‌లోకి కొత్త బడ్జెట్‌ ఫోన్లు..

మరోవైపు.. కేసీఆర్‌.. జాతీయ రాజకీయాలపై స్పందించిన రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌ ఆయనను అయన సంతోష పెట్టుకోడానికి చెప్పుకునే మాటలు అవి.. బీఆర్‌ఎస్‌ అని ఒకసారీ.. ఇంకోసారి ఫ్రంట్‌ అంటారు.. మీకు కేసీఆర్‌ ఫ్రంట్లు ప్రాధాన్యత ఉన్నట్టుండి.. కానీ, మాకు ఏం ప్రాధాన్యత అంశం కాదు.. అంత సీరియస్ విషయం కూడా కాదు అంటూ లైట్‌ తీసుకున్నారు రేవంత్‌.. ఇక, మేం అధికారంలోకి వస్తే అధికారికంగా సెప్టెంబర్ 17ను నిర్వహిస్తామని ప్రకటించారు. నేరాల పుట్ట ప్రగతి భవన్ అని ఆరోపించిన ఆయన.. అందుకే ప్రగతి భవన్ లో విచారణ చేయాలి.. లారీల కొద్దీ నోట్లు.. ఒప్పందాల కాగితాలు దొరుకుతాయని చెప్పుకొచ్చారు. లిక్కర్ స్కాంలో కవిత ఉందని బీజేపీ ఆరోపిస్తోంది.. బీజేపీ కార్యకర్తలు కవిత ఇంటి మీద దాడి చేశారు.. కానీ, సీబీఐ, ఈడీ.. కవితకు ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదన్నారు.. మూలం ప్రగతి భవన్ లో ఉంది. భూమి, ఇసుక, లిక్కర్‌ స్కామ్‌లకు కేరాఫ్‌ ప్రగతి భవన్‌ అని ఆరోపించిన ఆయన.. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే.. 2014 నుండి 2022 వరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆర్ధిక స్థితిగతులపై సీబీఐ విచారణ చేయించాలి.. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే ఫిరాయింపుదారుల వ్యాపారాలు.. కాంట్రాక్టులు.. భూముల రెగ్యులరైజేషన్‌పై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Show comments