National Awards : తెలంగాణ పంచాయతీలకు జాతీయ కిరీటం..!
- గ్రామీణాభివృద్ధిలో తెలంగాణకు జాతీయ గుర్తింపు
- మోతుకుపల్లి, ఫసల్వాడి పంచాయతీలకు ప్రతిష్టాత్మక అవార్డులు
- గుడ్ గవర్నెన్స్, మహిళా సాధికారతలో విశిష్ట ప్రతిభ
- రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు అవార్డులే నిదర్శనం: సీతక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబరిచిన తెలంగాణ పంచాయతీలకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు’ రాష్ట్రంలోని రెండు గ్రామ పంచాయతీలను వరించాయి. వికారాబాద్ జిల్లా కోటేపల్లి మండలానికి చెందిన మోతుకుపల్లి గ్రామ పంచాయతీ “గుడ్ గవర్నెన్స్” విభాగంలో జాతీయ అవార్డును దక్కించుకోగా, సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండల పరిధిలోని ఫసల్వాడి గ్రామ పంచాయతీ “విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ” విభాగంలో అత్యుత్తమ పురస్కారాన్ని సాధించింది. గ్రామ స్థాయిలో అత్యంత పారదర్శకమైన పరిపాలన అందించడం, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడం , మహిళా సాధికారత, భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమలులో చూపిన అసాధారణ కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు లభించాయి.
Airtel Rs 48 Plan : ఎయిర్‌టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్.. ఈ ఆఫర్ తెలిస్తే యూజర్లు అస్సలు వదలరు!
Also Read
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
జాతీయ స్థాయిలో తెలంగాణ పంచాయతీలకు ఈ గౌరవం దక్కడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి, పారదర్శక పాలన , మహిళా సాధికారత దిశగా తమ ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్టమైన చర్యలకు ఈ అవార్డులే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ఈ అద్భుత విజయాన్ని సాధించిన మోతుకుపల్లి, ఫసల్వాడి గ్రామ పంచాయతీల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థాయి సిబ్బంది , గ్రామస్థులకు ఆమె హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇలాంటి విజయాలు రాష్ట్రంలోని ఇతర పంచాయతీలకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయని, భవిష్యత్తులో మరిన్ని గ్రామాలు అభివృద్ధి బాటలో నడిచి జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తిని చాటాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!