Site icon NTV Telugu

Paddy Procurement : 7.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యo కొనుగోలు

Paddy Procuremnt

Paddy Procuremnt

ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6,832 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన ధాన్యం దిగుబడికి అనుగుణంగా ఇప్పటి వరకు 30 జిల్లాల్లో 5299 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం నాటికి 76,495 మంది రైతులనుంచి రూ. 1483 కోట్ల విలువ చేసే 7.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇందులో 7.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించడం జరిగింది. కొనుగోళ్లకు ప్రస్తుతం 8.36 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని కమిషనర్ తెలిపారు.

 

Exit mobile version