NTV Telugu Site icon

Telangana MLC ByPoll: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

Telangana Mlc Bypoll

Telangana Mlc Bypoll

Telangana MLC ByPoll: నిన్న అసెంబ్లీ, మొన్న లోక్ సభ, నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. నేటితో ప్రచారం ముగియనుండడంతో పట్టభద్రులను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రచారానికి ఇవాల్టితో గడువు ముగుస్తుండటంతో ఓరుగల్లుకు అగ్ర నేతలు,ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ అభ్యర్థుల కోసం ముఖ్యనేతల సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కు ఆదివారం ఒక్కరోజే మిగిలి ఉండడంతో ప్రలోభాలు జోరందుకున్నాయి. అగ్ర పార్టీల ముఖ్య నేతలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తు, నియోజకవర్గాలు, మండలాలు గ్రామాల, వారీగా కెడర్ ను కలిసి అభ్యర్థుల గెలుపుకు మద్దతు కూడగడుతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది బరిలో ఉండగా ఈనెల 27న పోలింగ్ జరగనుంది.

Read also: Hyderabad Metro: మెట్రో రైలు టైమింగ్స్ మార్పు.. సోమ, శుక్రవారాలు మాత్రమే..

తెలంగాణలో సోమవారం నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికలు జరగనున్నాయి. నేటితో పోలింగ్ ముగియనుండటంతో పట్టభద్రులు ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు బిజీ బిజీగా ఉన్నాయి. ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు తలపడుతున్నారు. అందుకే పేరుకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ప్రచారం, ప్రలోభాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేశారు. విజయం సాధించారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయ్యేలా బీఆర్‌ఎస్‌ తీవ్రంగా పోరాడుతోంది. పట్టభద్రుల్లో కూడా తమకు పట్టు ఉందని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ సీటు దక్కితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెక్ పెట్టవచ్చని బీజేపీ ఆలోచిస్తోంది.
Fire Accident: రంగారెడ్డి శ్రీనాత్ ఒవన్ ప్యాక్ కంపెనీలో అగ్ని ప్రమాదం..