NTV Telugu Site icon

Telangana: నేడు సౌత్ కొరియాలోని హాన్ నదిని సందర్శించనున్న తెలంగాణ మంత్రుల బృందం

Tg Ministers

Tg Ministers

నేడు దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం పర్యటనకు వెళ్తుంది. సౌత్ కొరియాలోని ముఖ్యమైన హన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ ను ఈ బృందం సందర్శించనుంది. సియోల్ నగరంలో నీటి సరఫరా, పర్యావరణం మరియు ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న హన్ నది.. కాలుష్యానికి గురైన హాన్ నదిని దక్షిణ కొరియా ప్రభుత్వం శుభ్రపరచి, పునరుద్ధరించింది. ఇక, పునరుజ్జీవన కార్యక్రమంలో ప్రైవేట్ డెవలప్మెంట్ పనులను నియంత్రించడం, పారిశ్రామిక వ్యర్థాలను తగ్గించడం, పర్యాటక ఆకర్షణలుగా నది ప్రదేశాలను అభివృద్ధి చేయడం లాంటి చర్యలు సియోల్ నగరపాలక సంస్థ చేపట్టింది.

Read Also: IND vs AUS: ఆస్ట్రేలియా టూర్.. కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌! నితీశ్ రెడ్డికి చోటు

అయితే, 494 కిలో మీటర్ల మేర హన్ నది ప్రవహిస్తుంది. సియోల్ నగరంలో 40 కిలో మీటర్ల మేర ప్రవహిస్తున్న హన్ నది.. ప్రక్షాళన తర్వాత శుభ్రంగా మారి.. ఇప్పుడు సియోల్ నగరానికి ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంతో పాటు జలవనరుగా మారింది. దీంతో నేడు హన్ నదిని తెలంగాణ ప్రతినిధి బృందం సందర్శించనుంది.