తెలంగాణ క్యాబినెట్ మంత్రుల మధ్య సమన్వలోపం కొట్టొట్టినట్టు కనిపిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇటీవల తరచూ జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనమని, దానివల్ల కొత్త రకం ఇబ్బందులు కూడా వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఒక శాఖకు చెందిన ఉన్నతాధికారులతో మరో శాఖ మంత్రి సమీక్షలు నిర్వహించడం సెక్రటేరియట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
నేడు దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం పర్యటనకు వెళ్తుంది. సౌత్ కొరియాలోని ముఖ్యమైన హన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ ను ఈ బృందం సందర్శించనుంది.