NTV Telugu Site icon

Telangana: ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలపై మంత్రుల సమీక్ష

Rains In Telangana

Rains In Telangana

ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానాలు కురుస్తూనే ఉన్నాయి. కామాారెడ్డి, నిర్మల్, బైంసా పట్టణాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. నిర్మల్ లో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్ర‌జ‌లంద‌రూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సూచించారు. ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల వ‌ల్ల ప్ర‌భావిత‌మైన నిర్మల్ పట్టణంలోని శాస్తి నగర్, శాంతి నగర్, మంచిర్యాల చౌరస్తా, నటరాజ నగర్ , బుధవార్ పేట్, హరిజన వాడ, డాక్టర్స్ లేన్ లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌ర్య‌టించారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను, నాలాలను పరిశీలించారు.

వర్షాలు మరో రెండు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. భైంసాలోని ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఉండి పోయిన ఆరుగురి కోసం అధికారుల సహాయక చర్యలు ప్రారంభించారు.. తెప్పల సాయంతో గార్డెన్ లో చిక్కుకున్న ప్రజలను రెస్య్కూ చేస్తున్నారు. బాసర రవీంద్ర పూర్ లో వరద పోటెత్తింది. మత్స్యకారుల సహాయంతో తెప్పల సాయంతో 20 మందిని పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Read Also: IND Vs ENG: రెండో టీ20లోనూ మనదే ఫస్ట్ బ్యాటింగ్.. ఓపెనర్లుగా రోహిత్, పంత్

భారీ వర్షాల నేపథ్యంలో నిజామామాద్, కామారెడ్డి జిల్లాల అధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష జరిపారు. డిజాస్టర్ మెనేజ్మెంట్ తో పాటు అన్ని శాఖల అధికారులు జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గోదావరి పరివాహక లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజల అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని..జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని.. స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని ఆదేశించారు.