Site icon NTV Telugu

Paddy Procurement: హస్తినలో తెలంగాణ మంత్రుల టీమ్.. కేంద్ర మంత్రులతో భేటీలు..

తెలంగాణ సర్కార్‌-కేంద్ర సర్కార్‌ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.. యాసంగిలో పడించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో… తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ చేరుకుంది. వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌లు… ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర మంత్రులను కలిసి… ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. వన్‌ నేషన్‌-వన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ రూపొందించాలని టీఆర్ఎస్‌ డిమాండ్‌ చేస్తోంది.

Read Also: TS RTC: ఆర్టీసీకి రవాణా శాఖ షాక్..

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతుండడంతో… టీఆర్ఎస్ ఎంపీలు హస్తినలో ఉన్నారు. పార్టీ ఎంపీలతో కలిసి… మంత్రుల బృందం… ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులను కలవనుంది. ఇప్పటికే అపాయిట్‌మెంట్లను కోరారు. మూడు రోజుల పాటు మంత్రులు ఢిల్లీలోనే ఉండనున్నారు. పంజాబ్‌ తరహాలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే… ఉద్యమించేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తున్నట్లే.. తెలంగాణలోనూ కేంద్ర ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తుందన్నారు బీజేపీ నేతలు. గతంలో కొనుగోలు కేంద్రాలు మూసివేస్తానన్న సీఎం… ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎలా అడుగుతారని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా మరోసారి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం.. టీఆర్ఎస్‌, బీజేపీ నేతల మధ్య మంట పెడుతోంది.

Exit mobile version