తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు గవర్నర్ తమిళిసై చుట్టూ తిరుగుతున్నాయి.. ప్రభుత్వంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. ఇక, కొందరు ఆమెను సపోర్ట్ చేస్తుంటే.. అధికార టీఆర్ఎస్ మాత్రం ఆమెను టార్గెట్ చేసి కౌంటర్ ఎటాక్ చేస్తోంది… తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గవర్నర్‌కి కూడా పరిమితులు ఉంటాయి… ప్రధాని, హోం మంత్రిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమి వచ్చింది..? అని ప్రశ్నించారు.. మేం వరి దాన్యం మీద పోరాటం చేస్తున్నాం.. గవర్నర్ బాధ్యతతో మాట్లాడాలి, రాజకీయాలు అవసరం లేదని హితవు పలికిన ఆయన.. అసలు గవర్నర్ వ్యవస్థ అవసరమే లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తలసాని.
Read Also: Addanki Dayakar: సోనియా గాంధీకి లేఖ.. ఉత్తమ్, కోమటిరెడ్డిపై ఫిర్యాదు..
నాడు ఎన్టీఆర్‌ను గద్దె దించేందుకు గవర్నర్‌ను వాడుకున్నారంటూ కామెంట్ చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. రాజకీయాలు గవర్నర్ మాట్లాడడం కరెక్ట్ కాదన్న ఆయన.. ఉపరాష్ట్రపతి మీడియాతో మాట్లాడలేను అని చాలా సార్లు తెలిపారు.. అది ఆయన హుందా తనం అని.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై ప్రశంసలు కురిపించారు.. వెంకయ్యనాయుడు రాజకీయ పరమైన అంశాలు మాట్లాడారు.. మా పరిధి వరకు మేము మాట్లాడుతం అని చాలా సార్లు చెప్పారని గుర్తు చేశారు. ఇక, బట్ట కాల్చి మీద వేసుడు కాదు… ధాన్యం మీరే కొంటె మైలేజ్ మీకే వస్తుంది కదా ? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు తలసాని.. ఇందిరా గాంధీ.. ఎన్టీఆర్ కి చేసినట్టు చేయాలని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారా? సెక్షన్ 8 అమలు దేనికి… ఇలాంటి పార్టీలు ఉండడడం దౌర్భాగ్యం… చీఫ్ పబ్లిసిటీకి ఎగబడ్డారని ఫైర్ అయ్యారు.. దాన్యం కొనుగోలు చేసి డిమాండ్ ఉన్న శ్రీలంక లాంటి దేశాలకు పంపించొచ్చు కదా? అని సలహా ఇచ్చారు. మరోవైపు.. డ్రగ్స్ వెనుక ఎవరు ఉన్న వదలా వద్దని సీఎం కేసీఆర్ ఇప్పటికే చెప్పారన్నారు తలసాని.. బాధ్యత రహితంగా రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నవి… డ్రగ్స్ ని పట్టుకుంది మేమే కదా..? అని నిలదీశారు.. హైదరాబాద్ లో డ్రగ్స్ ఉన్నట్లు, మనుషులు లేనట్లు మాట్లాడుతున్నారు.. డ్రగ్స్ ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూకలు తినిపించమని మాట్లాడుతున్నారు.. బీజేపీ వాళ్లు తినండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
