NTV Telugu Site icon

Talasani Srinivas Yadav: బీసీ నేతలపై వ్యక్తిగత దాడులు చేస్తే చూస్తూ ఊరుకోము

Talasani

Talasani

Talasani Srinivas Yadav: బీసీ నేతలను అవమానిస్తే సహించేది లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నివాసంలో బీఆర్‌ఎస్‌ బీసీ నేతలు సమావేశమయ్యారు. బీసీలను చులకన చేసేలా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. బాడీ షేమింగ్ గురించి మాట్లాడటం బాధాకరమని అన్నారు. ఈ తరహా వ్యాఖ్యలపై బీసీ కులాలందరినీ పిలిచి మాట్లాడుతామన్నారు. నోరుందని ఇష్టారీతిలో మాట్లాడితే చూస్తూ ఊరుకోనని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Read also: Sai Dharam Tej: మెగా షాక్.. నటనకు బ్రేక్ ప్రకటించిన సాయి ధరమ్ తేజ్

బీసీ నేతలపై వ్యక్తిగత దాడులు చేస్తే ఊరుకోమన్నారు. తాము తెగిస్తే దేనికి భయపడమన్నారు. రాబోయే రోజుల్లో తామేమిటో నిరూపించుకుంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పద్దతిగా ఉండేందుకు ఇన్నాళ్లు మౌనంగా ఉన్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసి లాభం పొందుతారని అనుకుంటే అది మీ కర్మ’ అని కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి అన్నారు. కళ్లు తెరవకుంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీలను ఏకం చేసి కాంగ్రెస్ అంతు చూస్తామని తలసాని స్పష్టం చేశారు.

త్వరలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆత్మగౌరవ భవనాలు నిర్మించామన్నారు. రైతు బంధు, రైతు బీమా మెజారిటీ బీసీలకు అందుబాటులో ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ విధానమో లేక సొంత ఎజెండానో అర్థం కావడం లేదన్నారు. బీసీల గురించి కించపరిచేలా మాట్లాడుతున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను తిరగనివ్వం. మేము ప్రజలకు సేవ చేయడానికి చిన్న సంఘం నుండి వచ్చిన నాయకులమన్నారు. 130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మాటలు నేర్పిందా? అని ప్రశ్నించారు.
Mayawati: బీజేపీ, విప‌క్ష పార్టీలు ప్రజల సంక్షేమం కోసం పని చేయడం లేదు..