Talasani Srinivas Yadav: బీసీ నేతలపై వ్యక్తిగత దాడులు చేస్తే చూస్తూ ఊరుకోము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talasani Srinivas Yadav: బీసీ నేతలను అవమానిస్తే సహించేది లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం తలసాని శ్రీనివాస్‌యాదవ్ నివాసంలో బీఆర్‌ఎస్ బీసీ నేతలు సమావేశమయ్యారు. బీసీలను చులకన చేసేలా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. బాడీ షేమింగ్ గురించి మాట్లాడటం బాధాకరమని అన్నారు. ఈ తరహా వ్యాఖ్యలపై బీసీ కులాలందరినీ పిలిచి మాట్లాడుతామన్నారు. నోరుందని ఇష్టారీతిలో మాట్లాడితే చూస్తూ ఊరుకోనని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Read also: Sai Dharam Tej: మెగా షాక్.. నటనకు బ్రేక్ ప్రకటించిన సాయి ధరమ్ తేజ్
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
బీసీ నేతలపై వ్యక్తిగత దాడులు చేస్తే ఊరుకోమన్నారు. తాము తెగిస్తే దేనికి భయపడమన్నారు. రాబోయే రోజుల్లో తామేమిటో నిరూపించుకుంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పద్దతిగా ఉండేందుకు ఇన్నాళ్లు మౌనంగా ఉన్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసి లాభం పొందుతారని అనుకుంటే అది మీ కర్మ’ అని కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి అన్నారు. కళ్లు తెరవకుంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీలను ఏకం చేసి కాంగ్రెస్ అంతు చూస్తామని తలసాని స్పష్టం చేశారు.
త్వరలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆత్మగౌరవ భవనాలు నిర్మించామన్నారు. రైతు బంధు, రైతు బీమా మెజారిటీ బీసీలకు అందుబాటులో ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ విధానమో లేక సొంత ఎజెండానో అర్థం కావడం లేదన్నారు. బీసీల గురించి కించపరిచేలా మాట్లాడుతున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను తిరగనివ్వం. మేము ప్రజలకు సేవ చేయడానికి చిన్న సంఘం నుండి వచ్చిన నాయకులమన్నారు. 130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మాటలు నేర్పిందా? అని ప్రశ్నించారు.
Mayawati: బీజేపీ, విపక్ష పార్టీలు ప్రజల సంక్షేమం కోసం పని చేయడం లేదు..
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..