NTV Telugu Site icon

Vemula Prashanth Reddy: అసంపూర్తిగా తెలంగాణ సచివాలయ పనులు.. 10 రోజుల్లో పూర్తి చేయాలని..

Vemula Prashanth Reddy

Vemula Prashanth Reddy

Prashanth Reddy: తెలంగాణ సచివాలయంలో అసంపూర్తిగా ఉన్న పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. తెలంగాణ నూతన సచివాలయాన్ని వచ్చే నెల 17న ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే తెలంగాణ సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఇంకా కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది. అసంపూర్తిగా ఉన్న పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. 10 రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకోవద్దని మంత్రి అధికారులకు సూచించారు. తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసి సకల సౌకర్యాలతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు. దీంతో 2019 జూన్ 27న కొత్త సచివాలయ నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. దాదాపు ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కార్యాలయ నిర్మాణం చేపట్టారు.

Read also: Khammam Traffic Restrictions: క‌నివినీ ఎరుగ‌ని రీతిలో ఖమ్మం స‌భ‌.. ట్రాఫిక్ ఆంక్షలు

తొమ్మిది నెలల్లో ఈ సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. కానీ కరోనా కారణంగా సచివాలయ నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. 2022 అక్టోబర్‌లో సచివాలయం ప్రారంభం కావాల్సి ఉండగా.. అక్టోబర్ నెల నాటికి సచివాలయ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. దీంతో అక్టోబర్ నెలలో జరగాల్సిన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ప్రస్తుతం సంక్రాంతికి మంచి రోజులు లేవు. సంక్రాంతి తర్వాత సచివాలయాన్ని ప్రారంభించాలని భావించారు. ఫిబ్రవరిలో కేసీఆర్ పుట్టినరోజు. దీంతో ఫిబ్రవరి 17న కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.కొత్త సచివాలయంలో మంత్రుల కార్యాలయాలతో పాటు ఆయా శాఖల అధికారుల కార్యాలయాలు కూడా ఉంటాయి. అంతేకాదు, సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా సమావేశ మందిరాలను కూడా నిర్మించారు. మరోవైపు మంత్రులు, సందర్శకులు, అధికారుల వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సచివాలయాన్ని ఏడు అంతస్తుల్లో నిర్మించారు. సీఎం కేసీఆర్ కార్యాలయం ఏడో అంతస్తులో ఉంది.