భారతీయ జనతా పార్టీ నేతలకు సవాల్ విసిరారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.. సాగు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీకి సవాల్ విసిరారు.. ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు కేంద్రం నుంచి తెలంగాణలో యాసంగిలో వేసే ఏ పంట అయిన కొంటాం అని ఉత్తరం తీసుకురావాలన్నారు.. ఒక వేళ లెటర్ తీసుకురాకపోతే పదవులకు బండి సంజయ్, కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.. కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా ? అని ప్రశ్నించిన ఆయన.. నేను మాట్లాడింది తప్పు అయితే వ్యవసాయ శాఖ మంత్రిగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. దమ్ముంటే తన ఛాలెంజ్ ను స్వీకరించాలన్నారు.
ఇక, కొనేది కేంద్రం… విధాన నిర్ణయం చేసేది ఎఫ్సీఐ… మీ కేంద్ర మంత్రి కొనమని చెబుతున్నాడు… మరి బీజేపీ నేతలు చేసే దీక్ష ఎవరి మీద? అని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి.. తెలంగాణ నుంచి ఇంత పంట అని కేంద్ర మంత్రి అంటారు.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరితో ఉందని మండిపడ్డారు.. ఈ వానా కాలం 1 కోటి 35 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం అంగీకారాన్ని ఇవ్వాలని అడిగామని గుర్తుచేసిన మంత్రి.. కేంద్రం 59 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రస్తుతం అంగీకరించిందన్నారు.. రైతాంగం దొడ్డు వడ్లు వేస్తారు… మార్కెట్ కు అమ్ముకోవడానికి… ప్రభుత్వం కొంటదని.. దానితో ఇబ్బంది అని చెబుతున్నాం.. అదే అందరూ చెప్పింది అని స్పష్టం చేశారు. నిలువలు ఉన్నాయి వరి ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం చెబుతోందని గుర్తుచేశారు మంత్రి నిరంజన్ రెడ్డి.. ఈ సీజన్ లో తెలంగాణ 63 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతోందన్న ఆయన.. వరి ధాన్యం కొనుగోలుపై తేల్చాల్సింది మాత్రం కేంద్రమే అన్నారు.. కానీ, బండి సంజయ్ దీక్ష ఎవరిని బ్లేమ్ చేయడానికి అంటూ మండిపడ్డారు నిరంజన్‌రెడ్డి.