ప్లీనరీకే తట్టుకోలేక పోతున్నారు.. విజయోత్సవ సభతో పిచ్చెక్కుతుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ విజయోత్సవ సభ తర్వాత ఒక్కొక్కరికి పిచ్చి పడుతుందని వ్యాఖ్యానించారు మంత్రి జగదీష్ రెడ్డి.. నల్గొండ కలెక్టరేట్లో యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు, వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే కేవలం 24 లక్షల టన్నులే తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, సీఎం కేసీఆర్ చొరవతో 45 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపారు.. ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన్లో వరి సాగు మరింతగా పెరిగిందన్న ఆయన.. నల్గొండ జిల్లాలో గతంలో లాగా 180 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరగనున్నాయన్నారు.. ధర విషయంలో రాజీలేదు, నాణ్యమైన పంటను మార్కెట్ కు తెచ్చి ధర పొందాలని.. రైతులు యాసంగిలో వరి ధాన్యం పండించే ఆలోచన చేయొద్దు, పండిస్తే ఒక్క గింజ కూడా కొనుగోలు చేయమని స్పష్టం చేశారు.
వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు మంత్రి జగదీష్ రెడ్డి.. వేరుశనగ, నువ్వులు, పెసళ్ళు, ఆవాలు, బొబ్బర్లు ఎంత పండించినా గింజ వృథా చేయకుండా కొనుగోలు చేస్తామన్న ఆయన.. ఈ పంటలకు దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉంది, వరి కంటే ఎక్కువగా ఈ పంటలకే ఆదాయం వస్తుందన్నారు.. దేశానికి కావాల్సిన ధాన్యంలో సగం ధాన్యం తెలంగాణ రాష్ట్రమే పండించిందన్న ఆయన.. అసెంబ్లీలో మాట్లాడే దమ్ము లేదు కానీ… ఒక రాజకీయ పార్టీ నడిపే నాయకుడు విజ్ఞతతో బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. ఇక, నిన్న అద్భుతంగా జరిగిన ప్లీనరీని తట్టుకోలేక కొంత మంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయిన ఆయన.. మరోవైపు.. రేపు విజయోత్సవ సభ తర్వాత ఒక్కొక్కరికి పిచ్చి పడుతుంది అంటూ సెటైర్లు వేశారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు