బీజేపీ నేతలతో పాటు.. కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి హరీష్ రావు.. కాంగ్రెస్, బీజేపీ నేతల కళ్లకు పచ్చకామెర్లు సోకాయంటూ ఎద్దేవా చేసిన ఆయన.. రాష్ట్రంలో అమలు అవుతున్న దళిత బంధు ప్రతిపక్ష నేతలకు కనిపించడం లేదా? అని నిలదీశారు. ఏడేళ్ల బీజేపీ పాలనలో సామాన్యులపై ధరల భారం పెంచారని మండిపడ్డారు.. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా..?, తెలంగాణలో ఉన్నన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా ? అంటూ నిలదీశారు.. ఇక, బీజేపీ నాయకులు ఏ మొఖం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతున్నారు అని సీరియస్ అయ్యారు.
Read Also: Revanth Reddy: కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్‌రెడ్డి స్వీట్ వార్నింగ్..! శాశ్వత బహిష్కరణే..!
పక్క రాష్ట్రం కర్ణాటకలో కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయి.. కనీసం 5 గంటల కరెంట్ కూడా ఇయ్యలేని దుస్థితిలో బీజేపీ ఉందని మండిపడ్డారు హరీష్‌రావు.. కానీ, బీజేపీ గ్లోబల్ ప్రచారానికే పరిమితమై ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. మతకల్లోలాలు సృష్టిస్తోంది.. సంక్షేమాన్ని విస్మరిస్తోంది అంటూ ఆరోపణలు గుప్పించారు. అధిక ధరలు పెంచిన బీజేపీ, ఆ పార్టీ నాయకులు పాద యాత్రలు చేయడానికి సిగ్గుండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు..స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా దళితులు ఇంకా ఊరికి దూరంగానే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లు పాలించినా.. ఏ ఒక్క దళితున్ని పట్టించుకోలేదు.. కేవలం ఓటు బ్యాంకు కోసమే దళితులను వినియోగించుకున్నారని విమర్శించారు.. బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినా ఇప్పటివరకు బీసీ మంత్రిత్వ శాఖ పెట్టలేదన్నారు. మరోవైపు, వడ్డీ లేని రుణాలు, అభయ హస్తం డబ్బులు లబ్ధిదారులకు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు మంత్రి హరీష్ రావు.
