NTV Telugu Site icon

కొత్త ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు.. హరీష్‌రావు ఫైర్

Harish Rao

Harish Rao

రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌ కావడంపై సంచలన ఆరోపణలు చేశారు మంత్రి హరీష్‌రావు.. కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు వచ్చారని వ్యాఖ్యానించిన ఆయన.. బాబు తన మనుషులకు కాంగ్రెస్‌లో పదవులు ఇప్పిస్తున్నారన్న ఆయన.. చంద్రబాబు ఆనాడు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే ఆంధ్రబాబు అని ప్రజలు వెల్లగొట్టారని.. టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని, తన మనుషులను కాంగ్రెస్ లోకి పంపి తెలంగాణలో చంద్రబాబు అడుగు పెడుతున్నారని కామెంట్ చేశారు.. రేవంత్ రెడ్డి ఎవరు ఓటుకు నోటు కేసులో ఉన్నవాళ్లే కదా? అని ప్రశ్నించారు హరీష్‌రావు.. చంద్రబాబుకు అత్యంత‌ సన్నిహితుడు.. ఇప్పుడు పీసీసీ‌ చీఫ్ గా వచ్చాడన్న ఆయన.. టీఆర్ఎస్ జెండా ఎత్తుకున్నాక.. పొలాల్లో నీళ్లు, ఇంటింటికీ తాగునీళ్లు వస్తున్నాయని.. 70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయని పని టీఆర్ఎస్ చేసిందన్నారు.