MAUD: బిల్డర్లకు గుడ్ న్యూస్.. టీడీఆర్ (TDR) వినియోగంపై ప్రభుత్వం సడలింపులు.!
- టీడీఆర్ నిబంధనల్లో కీలక సడలింపులు
- అంతస్తుల ఆధారంగా కొత్త మార్గదర్శకాలు
- హై-రైజ్ భవనాల నిర్వచనంలో మార్పులు
- రియల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్ ఇవ్వనున్న నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ (MAUD) ద్వారా రాష్ట్ర భవన నిర్మాణ నిబంధనలు-2012కు అత్యంత కీలకమైన సవరణలు చేస్తూ సమగ్రమైన ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, గతంలో టీడీఆర్ (TDR – Transferable Development Rights) వినియోగంపై ఉన్న కఠిన నిబంధనల వల్ల బిల్డర్లు, డెవలపర్ సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ కొత్త జీవో ప్రకారం, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ వినియోగంపై గతంలో ఉన్న 10 శాతం నిబంధనను సడలిస్తూ, భవనం అంతస్తుల సంఖ్యను బట్టి వర్గీకరించారు. దీని ప్రకారం 10 నుండి 20 అంతస్తుల వరకు నిర్మించే భవనాలకు 10వ అంతస్తు పైన ఉన్న మొత్తం బిల్ట్-అప్ ఏరియాలో కేవలం 3 శాతం టీడీఆర్ వినియోగిస్తే సరిపోతుంది. అలాగే 21 అంతస్తులకు పైగా నిర్మించే భారీ భవనాల విషయంలో 20వ అంతస్తు పైన ఉన్న ఏరియాలో 5 శాతం టీడీఆర్ వినియోగాన్ని తప్పనిసరి చేశారు. ఈ టీడీఆర్ సమర్పణలో కూడా బిల్డర్లకు వెసులుబాటు కల్పిస్తూ, మొత్తం టీడీఆర్‌లో 50 శాతాన్ని భవన నిర్మాణ అనుమతి (Building Permission) పొందే సమయంలో, మిగిలిన 50 శాతాన్ని భవనం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC) జారీకి ముందు సమర్పించేలా నిబంధనలను రూపొందించారు.
Box Office : ధురంధర్ – 2 దాటికి విలవిలలాడిన ఉస్తాద్ భగత్ సింగ్
Also Read
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
- Kavitha Arrest : రోడ్డుపై ధాన్యం పోసి నిరసన.. కవిత అరెస్ట్
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
భవనాల ఎత్తు , నిర్వచనాల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టతనిస్తూ, ఇకపై 21 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలను మాత్రమే ‘హై-రైజ్’ (High-Rise) భవనాలుగా పరిగణించనున్నారు. అయితే ఈ ఎత్తును లెక్కించేటప్పుడు భవనం పైన ఉండే చిమ్నీలు, వాటర్ ట్యాంకులు , లిఫ్ట్ మెషిన్ రూమ్‌ల ఎత్తును మినహాయించారు. ప్లాట్ పరిమాణం , ఎత్తుకు సంబంధించి, 750 చదరపు మీటర్ల నుండి 2000 చదరపు మీటర్ల లోపు వైశాల్యం గల ప్లాట్లలో 18 మీటర్ల నుండి 21 మీటర్ల ఎత్తు వరకు భవన నిర్మాణానికి టీడీఆర్ వినియోగం ద్వారా మాత్రమే అనుమతి లభిస్తుంది. సెట్‌బ్యాక్ నిబంధనల విషయంలో కూడా టీడీఆర్ వినియోగానికి ప్రాధాన్యతనిస్తూ, హై-రైజ్ భవనాలలో గరిష్టంగా 10 శాతం వరకు సెట్‌బ్యాక్ సడలింపు పొందేందుకు అవకాశం కల్పించారు, కానీ భవనం చుట్టూ కనీసం 7 మీటర్ల ఖాళీ స్థలం ఉండాలనే నిబంధనను మాత్రం యథాతథంగా కొనసాగించారు. నాన్-హై-రైజ్ భవనాలకు కూడా టీడీఆర్ ద్వారా ఇలాంటి సడలింపులు వర్తిస్తాయి.
Jeevan Reddy: హస్తం పార్టీకి సీనియర్ నేత జీవన్‌రెడ్డి గుడ్‌బై.. రాజీనామా డేట్ ఫిక్స్!
మరోవైపు రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్తుల అనుమతికి సంబంధించి ప్రభుత్వం కొత్త వెసులుబాటు కల్పించింది. 2000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో, 40 అడుగుల రోడ్డు ఉంటే 3 అదనపు అంతస్తుల వరకు, 60 అడుగుల రోడ్డు ఉంటే 4 అదనపు అంతస్తుల వరకు, , 80 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్ల పక్కన 5 అదనపు అంతస్తుల వరకు నిర్మించుకునే అవకాశం ఉంటుంది. మాస్టర్ ప్లాన్ రోడ్ల మార్పు లేదా తొలగింపు వంటి సందర్భాల్లో దరఖాస్తుదారులు నిర్ణీత ఛార్జీలు చెల్లించవచ్చు లేదా దానికి సమానమైన టీడీఆర్‌ను సమర్పించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ద్వారా జారీ చేయబడిన ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి. ఈ సవరణల వల్ల టీడీఆర్ లభ్యత లేక నిలిచిపోయిన అనేక ప్రాజెక్టులకు మోక్షం లభించడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్‌హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!