తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టంలోని 21వ సెక్షన్‌ను సవరిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ శనివారం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ సవరణ ద్వారా, గత కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉన్న “ఇద్దరు పిల్లల నిబంధన”ను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. అంటే, ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వ్యక్తులు కూడా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేయడానికి చట్టపరంగా అర్హత సాధించారు.
ఈ బిల్లును పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రవేశపెడుతూ, మారుతున్న కాలానికి , రాష్ట్ర అభివృద్ధి పరిణామాలకు అనుగుణంగా జనాభా పెరుగుదల రేటును సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలోనే ఈ నిబంధన తొలగింపును రాజకీయ పక్షాలతో పాటు సాధారణ ప్రజలు కూడా స్వాగతించారని ఆమె గుర్తు చేశారు. గతంలో ఈ నిబంధనపై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయగా, ఇప్పుడు దానికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేశారు. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ స్థాయి రాజకీయాల్లో నాయకత్వం వహించాలని ఆశపడే ఎంతో మంది అభ్యర్థులకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్లయింది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Balakrishna-Boyapati: ‘అఖండ’ కాంబో.. బాలయ్య అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్?
