తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టంలోని 21వ సెక్షన్‌ను సవరిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ శనివారం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ సవరణ ద్వారా, గత కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉన్న “ఇద్దరు పిల్లల నిబంధన”ను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. అంటే, ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వ్యక్తులు కూడా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక ఎన్నికల్లో…