కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ.. ఆ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఆపాలి..!

KRMB

KRMB

ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది.. నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు తాజాగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించింది కృష్ణానది యాజమాన్య బోర్డు బృందం… త్వరలోనే ఎన్జీటీ, కేంద్రానికి దీనిపై నివేదిక సమర్పించనున్నారు.. మరోవైపు.. లేఖలు, ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది… ఇశాళ కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు లేఖరాశారు తెలంగాణ ఇరిగేషన్‌ ఈఎన్సీ సి. మురళీధర్‌… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్మించిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఆపాలని లేఖలో పేర్కొన్నారు మురళీధర్‌.. మరి తెలంగాణ ఇరిగేషన్‌ ఈఎన్సీ లేఖపై అటు ఏపీ ప్రభుత్వం.. ఇటు కృష్ణానది యాజమాన్యబోర్డు ఎలా స్పందిస్తుంది అనేది వేచిచూడాలి.

ఇక లేఖలోని ముఖ్యాంశాలు

  • శ్రీశైలం జలాశయం నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా అక్రమ నీటి తరలింపును ఆపివేయాలి.
  • బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ద్వారా కె సి కాలువకు నీటిని తరలించడం వెంటనే ఆపివేయించాలి.
  • నీటి కేటాయింపులు లేని HNSS ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోతలను వెంటనే ఆపివేయాలి.
  • సుంకేశుల బ్యారేజి ద్వారా కె సి కాలువకు 39.90 TMCల నీటి కేటాయింపులు ఉండాగా ప్రతీఏటా సరాసరి 54 TMC ల తుంగభద్ర జలాలు తరలిస్తునారు. RDSకు 15.90 TMC కేటాయింపులు ఉండగా సరాసరి 5 TMCలకు మించి తరలించడం సాధ్యం కావడంలేదు.
  • తుంగభద్ర జలాలకు అదనంగా కె సి కాలువకు కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి తరలించడం అక్రమం.
  • ఆంధ్రప్రదే రాష్ట్రం కృష్ణా జలాల్లో శ్రీశైలం నుంచి 39 TMC లు మాత్రమే తరలించాలి. కానీ ఈ తరహా కేటాయింపులు లేని అక్రమ లిఫ్ట్ ల ద్వారా తన పరిమితికి మించి నీటిని ఎత్తి పోసుకుంటున్నది. కావున ట్రిబ్యున ద్వారా ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరిపే దాకా ఈ లిఫ్ట్ ల ద్వారా నీటి కేటాయింపులను KRMB నిరోధించాలి.