Site icon NTV Telugu

Telangana : మహిళా సంఘాలకు భారీ ఆర్థిక సహాయం.. రూ.344 కోట్లు విడుదల

Revanth Reddy

Revanth Reddy

Telangana : మహిళల ఆర్థిక సాధికారతకు తోడుగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) అభివృద్ధికి వడ్డీ లేని రుణాల రూపంలో భారీ నిధులను విడుదల చేసింది. మొత్తం రూ.344 కోట్లు విడుదల చేయగా, ఇందులో గ్రామీణ మహిళా సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ సంఘాలకు రూ.44 కోట్లు కేటాయించారు.

AP Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం!

ఈ నిధులను సోసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) ద్వారా జూలై 12 నుంచి 18 తేదీల మధ్య మహిళా సంఘాల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులను పంపిణీ చేయనున్నారు.

ఇది మాత్రమే కాదు… మహిళా సంఘాల కోసం అదనంగా ప్రమాద భీమా, లోన్ భీమా చెక్కులు కూడా ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ చర్యలన్నీ మహిళల ఆర్థిక స్వావలంబనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తీసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో, శాశ్వతమైన జీవనోపాధి అవకాశాలు సృష్టించడంలో ఈ నిధులు కీలక పాత్ర పోషించనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Jasprit Bumrah: బుమ్రానే అతడికి సరైన మొగుడు.. ఇప్పటికి పదిహేనోసారి!

Exit mobile version