NTV Telugu Site icon

జులై రెండో వారం త‌ర్వాత‌ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..!

students

క‌రోనా విజృంభ‌ణ‌తో అన్ని ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి.. అయితే, 12 వ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్రాల అభిప్రాయం కోరింది కేంద్ర ప్ర‌భుత్వం.. నేటితో ఆ గ‌డువు కూడా ముగిసిపోయింది.. ఇంటర్ పరీక్షల‌తో పాటు.. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై త‌న వైఖ‌రిని కేంద్రానికి తెలియ‌జేసింది తెలంగాణ ప్ర‌భుత్వం.. పరీక్షలు నిర్వ‌హించాల‌న్న సీబీఎస్ఈ ప్ర‌తిపాద‌న‌ల‌కు ఓకే చెప్పింది.. పరిస్థితిలు చక్కబడితే జులై రెండో వారం తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు పేర్కొంది… పరీక్ష సమయం మూడు గంటల నుండి గంటన్నరకి (90 నిమిషాలకు) కుదించాల‌ని.. కానీ, పరీక్ష విధానంలో మార్పు లేద‌ని స్ప‌ష్టం చేసింది.. ప్రశ్నలు మాత్రం సగం ఉంటాయి… ఆయా పేపర్ (సబ్జెక్టు) లో వచ్చిన మార్క్స్ ని రెట్టింపు చేయడం జరుగుతుంద‌ని త‌న అభిప్రాయాన్ని కేంద్రానికి తెలిపింది తెలంగాణ ప్ర‌భుత్వం.