Site icon NTV Telugu

YS Viveka murder case: అవినాష్‌రెడ్డి పిటిషన్‌.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

Mp Avinash Reddy

Mp Avinash Reddy

YS Viveka murder case: సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం రోజు తీర్పు ఇవ్వనుంది తెలంగాణ హైకోర్టు. సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌ వేశారు అవినాష్‌రెడ్డి. విచారణ సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్‌పై రేపు తీర్పు వెలువరించనుంది తెలంగాణ హైకోర్టు. ఇప్పటికే అవినాశ్‌రెడ్డి పిటిషన్‌పై ఇరువాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వు చేసింది. తన విచారణపై స్టే ఇవ్వాలన్న అవినాశ్‌రెడ్డి అభ్యర్థనపై శుక్రవారం న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది.

Read Also: Jagadish Reddy: బీజేపీ నుండి దేశాన్ని రక్షిస్తాం.. కవిత ఈడీ విచారణపై మంత్రి ధ్వజం

కాగా, ఎంపీ అవినాష్‌రెడ్డి రిట్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. విచారణ సమయంలో రికార్డ్‌ చేసిన ఆడియోలు, వీడియోలను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు. 35 మంది సాక్షుల స్టేట్‌మెంట్లను.. 11 సీడీలు, హార్డ్‌ డిస్క్‌లను కోర్టుకు అందజేసింది. అవినాష్‌రెడ్డి విచారణలో వీడియోగ్రఫీ అవసరం లేదని సీబీఐ పేర్కొంది. అయితే, నన్ను అరెస్టు చేయకుండా చూడండి అని న్యాయస్థానాన్ని కోరారు. సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌ వేశారు అవినాష్‌రెడ్డి. విచారణ సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ ముగిసేదాకా తనను 161 సీఆర్పీసీ కింద అసలు విచారించకుండా స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు.. ఇప్పటికే నన్ను సీబీఐ విచారించింది. అన్ని వివరాలూ వెల్లడించినప్పటికీ.. ఇంకా ఇబ్బంది పెడుతోంది. నా స్టేట్‌మెంట్‌ను ఆడియో వీడియో రికార్డు చేయడంతోపాటు స్టేట్‌మెంట్‌ కాపీని ఇచ్చేలా ఆదేశాలు జారీచేయండి. విచారణకు నాతోపాటు న్యాయవాదిని సైతం అనుమతించేలా ఆదేశించండి అంటూ అవినాష్‌రెడ్డి కోరిన విషయం తెలిసిందే.. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు.. శుక్రవారం ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.

Exit mobile version