Barrelakka: కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్ శిరీషకు భద్రత కల్పించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలంటూ ఇటీవల బర్రెలక్క హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె పటిషన్ దాఖలు చేయగా.. శుక్రవారం మధ్యాహ్నం ఆమె పటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్కకు భద్రత కల్పించాలని, బర్రెలక్క నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లకు ఒక గన్ మెన్‌తో పూర్తి భద్రత కల్పించాలని పోలీస్ శాఖను కోర్టు ఆదేశించింది.
Also Read: Revanth Reddy: కాంగ్రెస్ ఘనవిజయం ఖాయం.. మళ్లీ విజయోత్సవ సభకు వస్తా..
ఈ సందర్భంగా ఈసీకి, పోలీసులకు కోర్టు పలు సూచనలు చేసింది. గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదని… థ్రెట్ ఉందని అభ్యర్థించే అభ్యర్థులకు సెక్యూరిటీ కల్పించాలని సూచించింది. అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్‌దే అని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈనెల 21న తన సోదరుడిపై దాడి జరగడంతో తనకు 2+2 భద్రత కేటాయించాలని బర్రెలక్క తన పటిషన్‌లో కోరారు.
Also Read: Apple iPhone 14 : ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 14 పై భారీ తగ్గింపు..