Barrelakka: కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్ శిరీషకు భద్రత కల్పించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలంటూ ఇటీవల బర్రెలక్క హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె పటిషన్ దాఖలు చేయగా.. శుక్రవారం మధ్యాహ్నం ఆమె పటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.