Site icon NTV Telugu

Telangana: బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌.. అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సెషన్‌ ప్రారంభమైన తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు పడింది.. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలను గ‌వ‌ర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభించడంపై నిరసనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్‌, ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల రాజేంద‌ర్‌ల ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తూ తీర్మానం పెట్టడం.. దానికి స్పీకర్‌ అంగీకరించడం జరిగిపోయాయి. అయితే, దీనిపై న్యాయపోరాటానికి దిగారు బీజేపీ ఎమ్మెల్యేలు.. తమ సస్పెన్షన్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు.. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తెలంగాణ అసెంబ్లీ కార్యద‌ర్శికి నోటీసులు జారీ చేసింది.

Read Also: Education: విద్యాశాఖపై సీఎం కీలక సమీక్ష..

రాజ్యాంగ విరుద్ధంగా తమను సస్పెండ్‌ చేశారంటూ రాజాసింగ్‌, రఘునందన్‌, రాజేందర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది హైకోర్టు.. అయితే, అసెంబ్లీ వ్యవ‌హారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదంటూ కోర్టును కోరారు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్… ఇరు వ‌ర్గాల వాద‌న‌ల‌ను విన్న కోర్టు.. అసెంబ్లీ కార్యద‌ర్శికి నోటీసులు జారీ చేస్తూ త‌దుప‌రి విచార‌ణ‌ను రేపటికి వాయిదా వేసింది. మరి హైకోర్టుకు అసెంబ్లీ కార్యదర్శి ఎలాంటి సమాధానం ఇస్తారు.. రేపటి విచారణ ఎలా జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా బీజేపీ శాసన సభ సభ్యుల సస్పెన్షన్‌ వ్యవహారం.. హైకోర్టుకు చేరడం.. కోర్టు నోటీసులు జారీ చేయడం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.

Exit mobile version