Raja Singh: రాజాసింగ్‌కు రిలీఫ్.. బెయిల్ మంజూరు.. కండీషన్స్ అప్లై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana High Court Granted Raja Singh Bail With Conditions: విద్వేష వ్యాఖ్యల కేసులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. దాదాపు 40 రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన ఆయనకు బుధవారం బెయిల్ మంజురైంది. ఈమేరకు తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే.. కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను ధర్మాసనం మంజూరు చేసింది. ఇకపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని, ముఖ్యంగా మతాలను కించపరిచే విధంగా అభ్యంతకరమైన కామెంట్లు చేయకూడదని సూచించింది. అలాగే.. మీడియా ముందుకు రాకూడదని, 3 నెలల వరకు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేయకూడదని, జైలు నుంచి విడుదలయ్యే వేళ ర్యాలీలు సైతం నిర్వహించకూడదని షరతులు విధించింది. అనంతరం.. రాజాసింగ్‌ను తక్షణమే విడుదల చేయాల్సిందిగా పోలీసు శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ షోను హైదరాబాద్‌లో నిర్వహించొద్దని మొదటి నుంచి రాజాసింగ్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే! అయితే.. తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత మధ్య అతని షో నిర్వహించడంతో, అందుకు ప్రతీకారంగా రాజాసింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఒక వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంతో.. తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగింది. అప్పుడు బీజేపీ రాజాసింగ్‌ని సస్పెండ్ చేసింది. ఆ సమయంలోనే సమాజంలో మతవిధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాజాసింగ్ వ్యవహరిస్తున్నారంటూ.. ఆయనపై ఆగస్టు 25న పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి ఆయన చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Also Read
అయితే.. పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని రాజాసింగ్ భార్య ఉషాబాయి వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కౌంటరు దాఖలు చేశారు. అటు రాజాసింగ్ తరఫు న్యాయవాది రవిచందర్, ఇటు అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ తమతమ వాదనలు వినిపించారు. నిన్న (మంగళవారం) ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ని మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!