Site icon NTV Telugu

Telangana Rains: రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన.. దిక్కుతోచని స్థితిలో రైతన్న

Telangana Formers

Telangana Formers

Telangana Rains: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న రైతులపై వరుణుడు కూడా కరుణించలేదు. గురువారం ఒక్కసారిగా కురిసిన వర్షానికి ధాన్యం కుప్పలన్నీ కొట్టుకుపోయాయి. కల్లాలో కళ్ల ముందే కొట్టుకుపోతున్న వరిపంటను చూసి రైతుల కన్నీరు మున్నీరయ్యారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. రైతులు రాత్రంతా నిద్ర మానేసి కాలువలు తవ్వి నీటిని తొలగించారు. అధికారుల తీరుపై రైతులు కల్లాల వద్దే నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం, సిద్దిపేట జిల్లా వర్గల్‌లో వర్షం కారణంగా ధాన్యం తడిసింది. మెదక్ జిల్లా కొల్చారం, చిలిప్ చెడ్, నిజాంపేట్, రామాయంపేట మండలాల్లో, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో వరి తడిసింది.. కోహిర్ మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానకు మామిడి, అరటి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి.

Read also: Char Dham Yatra: చార్‌ధామ్‌ యాత్రలో భక్తుల రద్దీ.. ఈనెల31 వరకు వీఐపీ దర్శనాలు బంద్‌

మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ లో ఆరుబయట కుప్పలు వేసిన ధాన్యం, మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి, దుబ్బాక మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. గజ్వేల్ రింగ్ రోడ్డు వెంబడి నూర్చిన ధాన్యం కొట్టుకుపోయింది. రోడ్డు పక్కన కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని రైతులు సేకరిస్తున్నారు. సింగతం, శ్రీగిరిపల్లి, అహ్మదీపూర్‌, బూరుగ్‌పల్లి, దిలాల్‌పూర్‌, షేర్‌పల్లి గ్రామాలకు వెళ్లే దారిలో రోడ్ల పక్కన ఎండిపోయిన వడ్లూడిదీ దాదాపు ఇదే పరిస్థితి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కొనుగోలు కేంద్రం వడ్ల రాసు చుట్టూ నీరు నిలిచి రైతులు ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ మార్కెట్ యార్డులోనూ తడిసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు పడిగాపులు కాశారు. ఇక
TS TET Hall Ticket: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల..

Exit mobile version