గడల శ్రీనివాసరావు.. పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరిది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఇటీవల కాలంలో ఆయన వ్యాఖ్యలు అదే నిజం అనిపిస్తున్నాయి. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. అధికార పదవిలో ఉన్న గడల శ్రీనివాసరావు తాను కొత్తగూడెంకి సేవలు చేయాలని ఉన్నట్లుగా ప్రకటించడం వెనక ఏదో వ్యూహం ఉందని అంటున్నారు.
ఆయన ఇక్కడ పోటీ చేస్తాడని స్పష్టం అవుతుంది. కొత్తగూడెం నియోజకవర్గంలో గత కొంతకాలంగా గడల శ్రీనివాసరావు ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగ కల్పన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన మెగా జాబ్ మేళా సందర్భంగా గడల శ్రీనివాసరావు మాట్లాడారు. ఆయన కామెంట్లపై రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.
నాకు కొత్తగూడెం జన్మనిచ్చిందని కాబట్టి సేవ రూపంలో ఈ నియోజకవర్గానికి ఏదైనా తిరిగి ఇస్తానని చెప్పాడు. తనకి ఎంతో కొంత ఇచ్చిన దానికి తిరిగి ఇవ్వాలని ఈ ప్రయత్నం చేస్తున్నానని ఈ మట్టి రుణం తీర్చుకోవడానికి సేవా కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు మహేష్ బాబు సినిమా శ్రీమంతుడుని గుర్తుచేస్తుందని అంటున్నారు. ఈ ప్రపంచంలో మనుషులంతా టూరిస్టులేనని నాకు ఏదైనా రావాలని రాసి ఉంటే దాన్ని ఎవరూ ఆపలేరని కూడా అన్నారు.
కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయటం కోసం గదల శ్రీనివాసరావు మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగూడెంలో పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్ళకి దండం పెట్టి వివాదం రేపారు. అదేవిధంగా కొత్తగూడెంలో పూజలలో పాల్గొని చర్చనీయాంశమయ్యారు. కొత్తగూడెంలో కార్యక్రమాలు పెట్టినప్పుడల్లా ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్నారు శ్రీనివాసరావు. గతంలో ఓ ఐఎఎస్ అధికారి కేసీఆర్ కి వీరవిధేయుడిగా మారి, ఆయన కాళ్లకు నమస్కరించారు. తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీ అయిపోయారు. ఇదే తరహాలో శ్రీనివాసరావు వ్యూహం కూడా అదే విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Read Also: Koppula Eshwar : మంత్రి కొప్పుల ఈశ్వర్ తో నాగాలాండ్ ఎన్సీపీ అధ్యక్షుడు లోథా భేటీ