Half-Day Schools: మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు
- ఎండల దృష్ట్యా హాఫ్-డే స్కూల్స్ నిర్ణయం
- ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు
- టెన్త్ ఎగ్జామ్ సెంటర్లకు ప్రత్యేక టైమింగ్స్
- ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ , ప్రైవేట్ పాఠశాలలకు వచ్చే నెల మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు (Half-Day Schools) ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం, పాఠశాలలు ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే కొనసాగుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 గంటలకు భోజనం వడ్డించి, ఆ తర్వాత వారిని ఇంటికి పంపిస్తారు.
Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా కొనాలనుకుంటున్నారా.. మరికొన్ని రోజులు ఆగండి..
Also Read
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
అయితే, పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల పని వేళల్లో విద్యాశాఖ స్వల్ప మార్పులు చేసింది. బోర్డు పరీక్షలు ఉదయం పూట జరుగుతున్నందున, అటువంటి పాఠశాలల్లో తరగతులు మధ్యాహ్నం 1:00 గంట నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహిస్తారు. పదో తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతులు (Special Classes) పరీక్షల సమయం వరకు యధావిధిగా కొనసాగుతాయి. మరోవైపు, పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉర్దూ మీడియం పాఠశాలలు , డైట్ కళాశాలలకు ప్రత్యేక సమయాలను కేటాయించారు. ఇవి ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పనిచేస్తాయి. ఈ సమయంలో తగ్గిన పని గంటలను భర్తీ చేసేందుకు మార్చి 20 తర్వాత అదనపు తరగతులు నిర్వహించనున్నారు.
వేసవి సెలవుల షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ ఇప్పటికే ఖరారు చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి చివరి పనిదినం ఏప్రిల్ 23 కాగా, ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా వేసవి సెలవులు అమలులో ఉంటాయి. తిరిగి కొత్త విద్యా సంవత్సరం (2026-27) జూన్ 12 నుంచి ప్రారంభమవుతుంది. ఎండల తీవ్రత నుంచి విద్యార్థులను రక్షించేందుకు విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనించాలని అధికారులు సూచించారు.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియాను తేరుకోలేని దెబ్బకొట్టిన జింబాబ్వే!
తాజావార్తలు
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
-
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
-
RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!