రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం అందరినీ కలవరపెడుతోంది.. ఉక్రెయిన్‌లో దాదాపు 20 వేల మంది భారతీయులు ఉన్నారని తేల్చిన కేంద్రం.. ఇప్పటికే 4 వేల మంది వరకు భారత్‌కు తిరిగి వచ్చినట్టు ప్రకటించింది.. అంటే.. ఇంకా దాదాపు 16 వేల మంది ఉక్రెయిన్‌లోనే ఉన్నారు.. ఇక, తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా వందల సంఖ్యలో ఉక్రెయిన్‌లో ఉండడం ఆందోళన కలిగించే అంశం.. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులకు తగు సహాయం అందించేందుకు న్యూ ఢిల్లీతోపాటు తెలంగాణ సెక్రెటేరియట్‌లలో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్లడించారు..
Read Also: Jagga Reddy: రాజీనామాకు బ్రేక్ మాత్రమే.. వెనక్కి తగ్గేదిలేదు..!
ఢిల్లీ, హైదరాబాద్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసి విదేశాంగ శాఖతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది తెలంగాణ ప్రభుత్వం.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రత కోసం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిల్‌లో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని.. తనకు సందేశాలు పంపిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక, సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లోని సచివాలయంలో ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు.. సెక్రెటరేట్‌లో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీల వివరాలను సీఎస్ సోమేష్ కుమార్ ప్రకటించారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో..
విక్రమ్‌సింగ్‌మాన్: +91 7042566955
చక్రవర్తి పీఆర్‌వో: +91 9949351270
నితిన్ వోఎస్డీ : +91 9654663661
ఈమెయిల్ ఐడీ : rctelangana@gmail.com
తెలంగాణ సచివాలయం (హైదరాబాద్) ..
చిట్టిబాబు ఏఎస్‌వో: 040-23220603, +91 9440854433
ఈ-మెయిల్ ఐడీ : so_nri@telanagan.gov.in