NTV Telugu Site icon

Tamilisai: జాతీయ ఓటరు దినోత్సవంలో గవర్నర్‌.. అసెంబ్లీ ఎన్నికల ఘటనపై ప్రస్తావన..!

Tamilisai

Tamilisai

Tamilisai: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ అభ్యర్థి తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రచారం చేశారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనను ఆమె ప్రస్తావించారు. తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభ్యర్థి ప్రచారం చేశారని ఆమె గుర్తు చేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కోరారు. ఓటు ప్రధాన ఆయుధమని ఆమె అన్నారు. ఓటర్లపై ఎవరూ ఒత్తిడి చేయవద్దు. ప్రజాస్వామ్యం బతకాలంటే అందరూ ఓటు వేయాలని గవర్నర్ కోరారు. పోలింగ్ కేంద్రాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని గవర్నర్ కోరారు.

Read also: MP Ranjith Reddy: నాపై ఎందుకు కేసు పెట్టారో విశ్వేశ్వర్ రెడ్డి నే అడగండి : రంజిత్ రెడ్డి

ఎన్నికల రోజు ఇచ్చే సెలవు ఓటింగ్ కోసమేనని అన్నారు. అయితే ఈ సెలవుదినం సెలవులకు వెళ్లేందుకు కాదని గవర్నర్‌ తెలిపారు. ఓటు వేయడం మనందరి బాధ్యత అనే విషయాన్ని మరువకూడదని గవర్నర్ అన్నారు. ఓ సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా మార్చేది ఓటు హక్కు అని గవర్నర్ అన్నారు. విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం లైన్లో ఉంటామన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలో నిలబడాలని గవర్నర్ కోరారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ‘ఓటు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఓటు హక్కు పొందిన అఖిల అనే యువతికి తమిళిసై సౌందరరాజన్ ఓటరు గుర్తింపు కార్డును అందించారు.వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు గవర్నర్ బహుమతులు అందజేశారు. గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కౌశిక్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా తమిళిసై సౌందరరాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
TSPSC Chairman: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి.. గవర్నర్ ఆమోదం..