Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Telangana Government Revises Market Values Of Lands Flats

రేపటి నుంచి అమల్లోకి పెరిగిన భూముల రేట్లు..

Published Date :July 21, 2021 , 10:11 pm
By Sudhakar Ravula
రేపటి నుంచి అమల్లోకి పెరిగిన భూముల రేట్లు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ పెరిగిన భూముల ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రేట్ల పెంపుపై ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్‌… వ్యవసాయ భూములపై 50 శాతం పెంచింది. కనిష్ఠ మార్కెట్‌ విలువ ఎకరాకు 75 వేలుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఆయా ఏరియాల్లో ఉన్న మార్కెట్ విలువలకు అనుగుణంగా 3 స్లాబ్ లు చేసింది. ఓపెన్‌ ప్లాట్ల చదరపు గజం కనీస ధర 100 రూపాయల నుంచి 200 లకు పెంచిన సర్కార్… 50 శాతం, 40 శాతం, 30 శాతం లెక్కన శ్లాబులుగా చేసింది. అపార్ట్‌మెంట్ల ఫ్లాట్ల చదరపు అడుగు కనీస విలువ 800 నుంచి1000కి పెంచిన ప్రభుత్వం.. చదరపు అడుగుపై 20 శాతం, 30 శాతం లెక్కన పెంచింది. ఆదాయ వనరులు పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా భూముల మార్కెట్ ధరలు పెంచాలని, రిజిస్ట్రేషన్ చార్జెస్ హైక్ చేయాలని నిర్ణయించింది. 2013 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరిసారిగా భూముల విలువను సవరించింది అప్పటి ప్రభుత్వం. అప్పటి నుంచీ ల్యాండ్ వాల్యూస్ రివైజ్‌ చేయలేదు. ఇప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం రెట్టింపు కావడంతో భూముల విలువ పెంచింది సర్కార్‌. కేబినెట్‌ సబ్‌ కమిటీ సూచనలతో ఈ నిర్ణయం తీసుకుంది.

పెంచిన భూముల ధరలు రేపటి నుంచి అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. భూములు, ఆస్తుల విలువ పెంపునకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు అధికారులు. దీంతో రిజిస్ట్రేషన్ చార్జెస్ తో పాటు ఇతర సేవలు గిఫ్ట్ డీడ్, కుటుంబీకుల మధ్య రిజిస్ట్రేషన్లు, ఒప్పందాల రేట్లు కూడా పెరగనున్నాయి. అయితే, కరోనాతో అంచనా వేసుకున్నంత ఆదాయం ప్రభుత్వానికి రావడం లేదు. మరో వైపు ప్రభుత్వ వ్యయం పెరిగిపోతుంది. దీంతో ఆదాయం పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. వాటి కోసం వివిధ మార్గాలను వెతికింది. అందులో భాగంగా భూముల విలువల్ని, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది సర్కార్‌. గత వార్షిక బడ్జెట్‌లో రిజిస్ట్రేన్ల ద్వారా 10 వేల కోట్లు అంచనా వేస్తే.. కరోనా, ఇతర కారణాలతో టార్గెట్‌ రీచ్‌ కాలేదు. 2019-20లో అంచనా కన్నా ఎక్కువ ఆదాయం వచ్చినా.. 2020-21లో మాత్రం దెబ్బపడింది. టార్గెట్‌లో 52.43 శాతం మాత్రమే రీచ్ అయింది.

Also Read

  • Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..
  • Software Engineer: సాఫ్ట్‌వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
  • TG DGP Sivadhar Reddy: 32 ఏళ్ల పోలీస్ సేవకు గౌరవ వందనం.. డీజీపీ శివధర్ రెడ్డికి వీడ్కోలు
  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

ఈ ఆర్థిక సంవత్సరంలో 12 వేల 500 కోట్ల ఆదాయం టార్గెట్‌గా పెట్టుకుంది ప్రభుత్వం. అయితే ఏప్రిల్, మే నెలలో వచ్చింది మాత్రం 957 కోట్లు మాత్రమే. ప్రస్తుతం రివైజ్డ్ చేసిన ధరల వల్ల ప్రభుత్వానికి నెలకు అదనంగా 250 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జ్‌లు రెండూ ఒకేసారి పెంచడంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఏదో ఒకటి పెంచి మరో దానికి గడువు ఇస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇన్నేళ్లు ఆగి ఇప్పుడు రెండూ ఒకే సారి పెంచడం వల్ల తీవ్ర భారం పడుతుందంటున్నారు విశ్లేషకులు. భూ సేకరణ కోసమే ప్రభుత్వం ఇన్ని రోజులు మార్కెట్ విలువను సవరించలేదని విమర్శిస్తున్నారు. భూముల విలువలు పెరిగినా.. ప్రస్తుత బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలకు.. పెంచిన మార్కెట్ ధరలకు వ్యత్యాసం ఎక్కువగానే ఉంది. ధరలు పెంచడం వల్ల కొద్దీ మేరకు నల్ల ధనాన్ని నివారించవచ్చు. లోన్లకు కూడా ఇబ్బంది ఉండదు అనే సానుకూలత కూడా వ్యక్తమవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Flats
  • Land Market Values
  • lands
  • plots
  • telangana

తాజావార్తలు

  • AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

  • Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్‌తో సమావేశం

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • Hardik Pandya: హార్దిక్‌ను నట్టేట ముంచేస్తోన్న రోహిత్, సూర్య.. మీకు పాండ్య ఎంత చేశాడో గుర్తుందా బ్రోస్!

  • Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..

ట్రెండింగ్‌

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions