తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు నేడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల చేసింది. దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు కోసం హుజూరాబాద్ ప్రారంభోత్సవం సభలో ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధుల లక్ష్యం, నేడు విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది. పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పూర్తిచేసుకున్నది.
అయితే దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కోసం మొదట 9.8.21 నాడు రూ. 500 కోట్లు విడుదల చేయగా ఆ తర్వాత 23.08.2021 నాడు రూ. 500 కోట్లు, 24.08.2021 నాడు రూ. 200 కోట్లు, 25.08.2021 నాడు రూ. 300 కోట్లు, 26.08.2021 అనగా నేడు రూ. 500 కోట్లు విడుదల చేయడంతో మొత్తం రూ. 2000 కోట్ల నిధులు విడుదల అయ్యాయి.