Site icon NTV Telugu

కేఆర్‌ఎంబీకి తెలంగాణ సర్కార్‌ లేఖ.. ఏపీపై ఫిర్యాదు

KRMB

KRMB

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య జల వివాదం మళ్లీ రాజుకుంటుంది… ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల పర్వం కూడా కొనసాగుతోంది.. తాజాగా.. పర్యావరణ అనుమతులు లేకుండానే కృష్ణనదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది తెలంగాణ సర్కార్.. 14.12.2020 నాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేని కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాలని ఇచ్చిన ఆర్డర్‌ను భేఖాతర్ చేస్తుందని కేఆర్‌ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్నారు తెలంగాణ నీటిపారుదలశాఖ స్పెషల్ సెక్రెటరీ రజత్ కుమార్. దీనిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు.. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను తక్షణమే నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం.. డీపీఆర్‌లు సమర్పించకుండా ఎటువంటి పనులు చేపట్టారదాని గతంలోనే జలశక్తి శాఖ స్పష్టం చేసిందని గుర్తుచేశారు.

Exit mobile version